Actor Varun Tej, Lavanya Tripathi Wedding Postponed? - Sakshi
Sakshi News home page

Varun - Lavanya Wedding: వరుణ్-లావణ్య పెళ్లి తేదీ మారిందా?

Aug 13 2023 1:22 PM | Updated on Aug 13 2023 2:26 PM

Actor Varun Tej Lavanya Tripathi Wedding Postponed - Sakshi

మెగాహీరో వరుణ్ తేజ్ పెళ్లి ఆగస్టు చివర వారంలో అని కొన్నాళ్ల ముందు టాక్ వినిపించింది. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే మాత్రం ఇప్పట్లో ఆ తంతు జరిగేలా కనిపించట్లేదు. ఎందుకంటే ఎంత డెస్టినేషన్ వెడ్డింగ్ అయినాసరే శుభలేఖలు పంచడం, బ్యాచిలర్ పార్టీలు ఇలా ఏదో ఒకటి జరగాలి. కానీ ఇప్పుడు అలాంటిదేం లేకపోయేసరికి పెళ్లి వాయిదా పడిందని ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు. అలానే తేదీ మార్పు వెనక ఓ కారణం ఉన్నట్లు తెలుస్తోంది.

మెగా ఫ్యామిలీలో డిఫరెంట్ మూవీస్ చేస్తూ వరుణ్ తేజ్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. 'ముకుంద' దగ్గర నుంచి ఆగస్టు 25న థియేటర్లలోకి రాబోతున్న 'గాండీవధారి అర్జున' వరకు వేటికవే భిన్నమైన చిత్రాలని చెప్పొచ్చు. సినిమాల గురించి పక్కనబెడితే వరుణ్ తేజ్.. హీరోయిన్ లావణ్య త్రిపాఠితో గత ఏడేళ్లుగా రిలేషన్‌షిప్ మెంటైన్ చేస్తూ వచ్చాడు. ఈ జూన్‌లో వీళ్లిద్దరికీ పెద్దల సమక్షంలో నిశ్చితార్థం జరిగింది.

(ఇదీ చదవండి: మెగా బ్రదర్స్‌కు రీమేక్స్ నేర్పుతున్న పాఠాలు!)

ఇక ఎంగేజ్‌మెంట్ తర్వాత పెళ్లి టాపిక్ తెరపైకి వచ్చింది. ఆగస్టు 24న ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేశారని అన్నారు. అయితే ఇప్పుడది వాయిదా పడినట్లు తెలుస్తోంది. వరుణ్ తేజ్ చెల్లెలు నిహారిక ఈ మధ్యే విడాకులు తీసుకుంది. ఇది జరిగి ఎన్ని రోజులు కాలేదు. మళ్లీ వెంటనే ఇంట్లో శుభకార్యం అంటే బాగోదని ఆలోచించి, పెళ్లి తేదీలో మార్పు చేసినట్లు సమాచారం.

నిహారిక ప్రస్తుతం విడాకుల డిప్రెషన్ నుంచి బయటపడే పనిలో ఉంది. ఫ్రెండ్స్‌తో వెకేషన్స్‌కి వెళ్తూ సమయాన్ని ఆస్వాదిస్తోంది. అలా ఇంట్లో పరిస్థితులు కాస్త కుదురుకున్న తర్వాత, మరోవైపు ముహుర్తాలు చూసి పెళ్లి చేయాలని నాగబాబు భావిస్తున్నారట. అంటే నవంబరు-డిసెంబరులో వరుణ్-లావణ్య పెళ్లి జరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. కొన్నాళ్లు ఆగితే ఏ విషయమనేది క్లారిటీ వచ్చేస్తుంది. అప్పటివరకు వెయిట్ అండ్ సీ.

(ఇదీ చదవండి: ఆ హీరోయిన్‌తో యంగ్ హీరో పెళ్లి... డేట్ కూడా ఫిక్స్!)

Advertisement
 
Advertisement
Advertisement