ఎన్టీఆర్‌ బావ మరిది 'నార్నే నితిన్‌' నిశ్చితార్థం | Junior NTR Brother-In-Law Actor Narne Nithin Engagement With Shivani Talluri, Photos Goes Viral | Sakshi
Sakshi News home page

Narne Nithin Engagement: ఎన్టీఆర్‌ బావ మరిది 'నార్నే నితిన్‌' నిశ్చితార్థం

Nov 3 2024 5:32 PM | Updated on Nov 4 2024 11:06 AM

Actor Narne Nithin Engagement

ఎన్టీఆర్‌ సతీమణి లక్ష్మీ ప్రణతి సోదరుడు  నార్నే నితిన్‌చంద్ర పెళ్లి పీటలెక్కనున్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన శివానితో నేడు నవంబర్‌ 3న నిశ్చితార్థం జరిగింది. హైదరాబాద్‌లో ఇరు కుటుంబ పెద్దల సమక్షంలో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది.   నెల్లూరు జిల్లాలో యువతి కుటుంబానికి రాజకీయ నేపథ్యం ఉన్నట్లు తెలుస్తోంది. హీరో వెంకటేష్‌ కుటుంబంతో వారికి దగ్గర బంధుత్వం కూడా ఉందట.

నార్నే నితిన్‌ నిశ్చితార్థం వేడుకలో ఎన్టీఆర్‌, ఆయన సతీమణి లక్ష్మీ ప్రణతితో పాటు వారి కుమారులు అభయ్‌, భార్గవ్‌లు సందడిగా కనిపించారు. ఈ కార్యక్రమంలో కల్యాణ్‌రామ్‌, వెంకటేశ్‌ పాల్గొన్నారు. కాబోయే వధూవరులను వారు ఆశీర్వదించారు.

ప్రముఖ పారిశ్రామికవేత్తగా గుర్తింపు పొందిన నార్నే శ్రీనివాసరావు తనయుడే నార్నే నితిన్‌. 2023లో మ్యాడ్‌ సినిమాతో ఎన్టీఆర్‌కు బావ మరిదిగా పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చిన ఆయన రీసెంట్‌గా ఆయ్‌ సినిమాతో ప్రేక్షకులను మెప్పించారు. 

Advertisement
 
Advertisement
Advertisement