Ashish Reddy Wedding: నిర్మాత దిల్ రాజు తమ్ముడి కొడుకు పెళ్లి.. కేసీఆర్‌కి ఆహ్వానం | Actor Ashish Reddy Wedding Invitation For Kcr And Prabhas | Sakshi
Sakshi News home page

Ashish Reddy Wedding: దిల్ రాజు తమ్ముడి కొడుకు పెళ్లి.. సెలబ్రిటీలకు ఆహ్వానాలు

Published Sat, Feb 3 2024 9:23 PM | Last Updated on Sat, Feb 3 2024 9:28 PM

Actor Ashish Reddy Wedding Invitation For Kcr And Prabhas - Sakshi

టాలీవుడ్ నిర్మాత దిల్‌ రాజు సోదరుడు అశిష్‌ రెడ్డి  త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడు. ఫిబ్రవరి 14న అద్వైత రెడ్డి అనే అమ్మాయితో ఏడడుగులు వేయబోతున్నాడు. జైపూర్‪‌లో ఈ వేడుక జరగనుంది. ఈ క్రమంలోనే పలువురు సెలబ్రిటీలకు శుభలేఖలు అందజేస్తున్నారు.

(ఇదీ చదవండి: బిగ్‌బాస్ ప్రియాంకతో సహజీవనం, పెళ్లి.. బాయ్‌ఫ్రెండ్ సమాధానమిదే)

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్‌ని నిర్మాత దిల్ రాజు కలిశారు. ఇందిరానగర్‌లోని కేసీఆర్‌ని కలిసిన దిల్ రాజు.. తన తమ్ముడు శిరీష్ రెడ్డి కుమారుడు ఆశిష్ రెడ్డి పెళ్లికి రావాలని శుభలేఖ అందజేశారు. టాలీవుడ్ హీరోలు ప్రభాస్, అఖిల్‌కి కూడా ఆహ్వాన పత్రికలు అందజేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇకపోతే 'రౌడీ బాయ్స్' సినిమాతో హీరోగా తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన ఆశిష్ రెడ్డి.. ప్రస్తుతం 'సెల్ఫిష్' అనే మూవీలో నటిస్తున్నాడు. హీరోగా గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నంలో ఉన్నాడు. 

(ఇదీ చదవండి: పెళ్లి అయిపోయిందిగా సినిమాలు మానేస్తారా? క్లారిటీ ఇచ్చిన మెగా కోడలు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement