● రేపు ప్రభుత్వ బాలుర కళాశాల మైదానంలో వేడుకలు
స్టేషన్ మహబూబ్‌నగర్: నగరంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల మైదానంలో మంగళవారం దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని ఉత్సవ కమిటీ కోశాధికారి కేఎస్ రవికుమార్ అన్నారు. నగరంలోని రెడ్‌క్రాస్ భవన్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పాలమూరులో నిర్వహించే దసరా ఉత్సవాలకు ప్రత్యేకత ఉందన్నారు. దసరా ఉత్సవాలను ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం ఆర్యసమాజ్‌లో దేవయజ్ఞం ఉంటుందన్నారు. గోరంట్ల మాల్యాద్రిరెడ్డి ధ్వజదారిగా వ్యవహరిస్తారని, మధ్యాహ్నం 3 గంటలకు ఆర్యసమాజ్ నుంచి ఊరేగింపు ఉంటుందన్నారు. దేవతామూర్తుల వేషధారణలు, కోలాట ప్రదర్శన, చెక్క భజనలతో శోభాయాత్ర బయలుదేరుతుందన్నారు. డాక్టర్ భరద్వాజ్ నారాయణరావు ధ్వజారోహణం చేస్తారన్నారు. మైదానంలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, భక్తిగీతాలు, శాసీ్త్రయ నృత్య ప్రదర్శనలు ఉంటాయని, సంస్కృత ఉపన్యాసకులు పల్లె యాదయ్య దసరా సందేశం ఇస్తారని చెప్పారు. అదేవిధంగా మైదానంలో పెద్దఎత్తున బాణాసంచా నిర్వహిస్తామన్నారు. వేడుకల్లో ఎంపీ డీకే అరుణ, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, మేయర్ మమత, డిప్యూటీ మేయర్ సురేందర్‌రెడ్డి తదితరులు హాజరవుతారన్నారు. అనంతరం దసరా ఉత్సవాల వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. సమావేశంలో ఉత్సవ కమిటీ గౌరవాధ్యక్షుడు మురళీధర్‌రావు, సభ్యులు చంద్రకుమార్‌గౌడ్, మాల్యాద్రిరెడ్డి, అంజయ్య, భాస్కర్‌గౌడ్, లక్ష్మణ్, వెంకటేశ్, రమేష్, లక్ష్మీకాంత్, నర్సింహారెడ్డి, కోమల్, సాయితేజ తదితరులు పాల్గొన్నారు.


