చెప్పులు లేకుండా ప్రజాసేవ | Sakshi
Sakshi News home page

చెప్పులు లేకుండా ప్రజాసేవ

Published Thu, Dec 21 2023 1:06 AM

చెప్పులు లేకుండా 
మండల కార్యాలయానికి వస్తున్న రామాంజనేయులు  - Sakshi

దేవరకద్ర: ఓ యువ సర్పంచ్‌ చెప్పులు ధరించకుండా ప్రజలకు సేవలు అందిస్తున్నారు. సర్పంచ్‌గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి నేటివరకు చెప్పులు లేకుండా తిరుగుతూ ప్రజాసమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. దేవరకద్ర మండలంలో కొత్తగా ఏర్పడిన నా ర్లోనికుంట్ల గ్రామపంచాయతీ నుంచి మొదటి సర్పంచ్‌గా 22 ఏళ్ల వయ సు గల రామాంజనేయులు ఎన్నికయ్యారు. 2019 జనవరి 21న సర్పంచ్‌గా బాధ్యతలు చేపట్టిన అతడు.. నాటి నుంచి చెప్పులను వదిలేసి ప్రజాసేవకు అంకితమయ్యారు. ఇప్పటికీ చెప్పులు లేకుండా ప్రభుత్వ కార్యాలయాలతో పాటు ఎక్కడికి వెళ్లి నా పాదరక్షలు లేకుండానే తిరగడం గమనార్హం.

ఇది ఒక పవిత్ర పనిగా భావిస్తున్నా..

ర్పంచ్‌ పదవి ఎంతో పవిత్రమైనది. అందుకే ఆ పదవిలో ఉన్నన్ని రోజులు కాళ్లకు చెప్పులు వేసుకోరాదని నిర్ణయం తీసుకున్నా. ఎప్పటి వరకు ఉత్త కాళ్లతో తిరుగుతానో చెప్పలేను. సర్పంచ్‌గా ప్రజలకు తనవంతు సేవలు అందిస్తున్న. భవిష్యత్‌లో ఎంపీటీసీగా పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నా.

– రామాంజనేయులు, సర్పంచ్‌, నార్లోనికుంట్ల

నార్లోనికుంట సర్పంచ్‌ అంకుఠిత దీక్ష

Advertisement
Advertisement