ఓటు హక్కును వినియోగించుకోవాలి | Sakshi
Sakshi News home page

ఓటు హక్కును వినియోగించుకోవాలి

Published Thu, Nov 16 2023 1:32 AM

ర్యాలీని ప్రారంభిస్తున్న  కలెక్టర్‌   - Sakshi

మహబూబాబాద్‌: అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతీ ఓటరు తమ ఓటు హక్కును బాధ్యతగా వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ కె శశాంక అన్నారు. ఈసీ ఆదేశాల ప్రకారం స్వీప్‌ ప్రచార కా ర్యక్రమంలో భాగంగా బుధవారం ప్రభుత్వ ఉద్యోగులు కలెక్టర్‌ కార్యాలయం నుంచి నిర్వహించిన బైక్‌ ర్యాలీని కలెక్టర్‌ జెండా ఊపి ప్రారంభించి మా ట్లాడారు. ఓటు హక్కు బ్రహ్మాస్త్రం లాటిందన్నారు. స్వీప్‌ కార్యక్రమాల వల్ల ఓటు నమోదు శాతం పెరి గిందని, ఓటింగ్‌ శాతం పెంచేందుకు తగు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఓటరు తుది జాబితా పూర్తి అయిందని, పోలింగ్‌ కేంద్రాల్లో దివ్యాంగులు, వయో వృద్ధులను దృష్టిలో పెట్టుకుని తగు ఏర్పా ట్లు చేస్తున్నామని చెప్పారు. ర్యాలీలో అదనపు కలెక్టర్‌ డేవిడ్‌, ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొన్నారు.

మహిళా పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు

ప్రతి నియోజకవర్గంలో 5మోడల్‌,5మహిళా పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశామని, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ శశాంక అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్‌ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఎంపీడీఓలు, ఇంజనీరింగ్‌ అధికారులుతో పోలింగ్‌ కేంద్రాల్లో వసతుల కల్పనపై సమీక్షించారు.కలెక్టర్‌ మాట్లాడుతూ.. ప్ర తీ పోలింగ్‌ కేంద్రంలో తాగునీరు ఇతర సౌకర్యాలు కల్పించాలన్నారు. సమీక్ష సమావేశంలో జెడ్పీ సీఈ ఓ రమాదేవి,సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

నేటి నుంచి ఓటరు స్లిప్పుల పంపిణీ..

జిల్లాలోని మానుకోట, డోర్నకల్‌ నియోజకవర్గాల్లో నేటిన నుంచి ఓటరు స్లిప్పులు పంపిణీ చేస్తామని కలెక్టర్‌ శశాంక అన్నారు. సంబంధిత రిటర్నింగ్‌ అధికారి ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధుల సహకారంతో బీఎల్‌ఓల ద్వారా పంపిణీ చేస్తామన్నారు. వారం రోజుల్లో ప్రక్రియ పూర్తి చేయడం జరుగుతుందన్నారు.

జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ శశాంక

Advertisement
Advertisement