‘గిరి’ గ్రామాల్లో దండారీ ఉత్సవాలు | Sakshi
Sakshi News home page

‘గిరి’ గ్రామాల్లో దండారీ ఉత్సవాలు

Published Fri, Nov 10 2023 5:18 AM

ఉత్సవాలకు శ్రీకారం చుడుతున్న ఆదివాసీలు - Sakshi

మంచిర్యాలరూరల్‌(హాజీపూర్‌): హాజీపూర్‌ మండలంలోని మొర్రిగూడెం, నాగారం, చిన్నగోపాల్‌పూర్‌ గిరిజన గ్రామాల్లో ఆదివాసీలు దండారీ ఉత్సవాలకు గురువారం శ్రీకారం చుట్టారు. దీపావళిని పురస్కరించుకుని గోండుతెగకు చెందిన ఆదివాసీలు ఖాఖోభాయి ఆలయ భేటీకి వెళ్లివచ్చి ఎత్మల్‌సార్‌–గుమ్మెల దండారీ ఉత్సవాలు ప్రారంభించారు. ఈ ఉత్సవాలు నాలుగు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరపనున్నారు. ప్రత్యేక వేషధారణలో డప్పుచప్పుళ్ల మధ్య సంప్రదాయ నృత్యం చేస్తూ తమ ఆరాధ్య దేవతకు ప్రత్యేక మొక్కులు చెల్లించుకున్నారు. ఊరు పోచమ్మ, హనుమాన్‌ ఆలయాలతో పాటు సకల దేవుళ్లకు పూజలు చేశారు. దీపావళి మరుసటి రోజున గంగస్నానాలు ఆచరించి ప్రత్యేక పూజలతో ఉత్సవాలు ముగిస్తారు. అనంతరం పంట కోతలు ప్రారంభిస్తామని ఆదీవాసీలు పేర్కొన్నారు. ఉత్సవాల్లో దండారీ పెద్దలు పెంద్రం మారు, పెంద్రం లస్ము, సోనేరావు, ధర్మారావు, సురేష్‌ పటేల్‌, తెలంగారావు, యువకులు శ్రావణ్‌, రాజ్‌కుమార్‌, రాకేశ్‌, తిరుప తి, అర్జున్‌, రాంచందర్‌, మనోజ్‌ పాల్గొన్నారు.

సంప్రదాయ వేషధారణలో ఆదివాసీలు
1/2

సంప్రదాయ వేషధారణలో ఆదివాసీలు

సంప్రదాయ పూజల్లో గిరిజనులు
2/2

సంప్రదాయ పూజల్లో గిరిజనులు

Advertisement
Advertisement