పెద్ద నోటు లేదాయే..! | - | Sakshi
Sakshi News home page

పెద్ద నోటు లేదాయే..!

Published Mon, Nov 20 2023 12:06 AM | Last Updated on Mon, Nov 20 2023 12:06 AM

- - Sakshi

2014 ఎన్నికల సమయాన రూ.వెయ్యి నోటు భారీ ఎత్తున చేతులు మారింది. ఈ నోటును 2016 నవంబర్‌ 8న రిజర్వ్‌ బ్యాంకు రద్దు చేసింది. అనంతరం రూ.2 వేల నోటును చెలామణిలోకి తెచ్చింది. 2018 ఎన్నికల్లో ఈ పెద్ద నోటు అందరి కళ్లలోనూ కాంతులు నింపింది. ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు కిందిస్థాయి నాయకులు, ఓటర్లకు పెద్దఎత్తున వీటిని పంపిణీ చేశారని చెబుతారు. ఆ తర్వాత ఈ నోటును కూడా కేంద్రం నిలిపివేయడంతో ప్రస్తుత ఎన్నికల్లో రూ.500 మాత్రమే చెలామణి అవుతోంది. అయితే, భారీగా నగదు తీసుకురావాలన్నా, పంపిణీ చేయాలన్నా రూ.500 నోట్లే అందుబాటులో ఉండటంతో అభ్యర్థులు సమస్య ఎదుర్కొంటున్నట్లు చర్చ జరుగుతోంది!. – చుంచుపల్లి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement