కాశీ యాత్ర అని కపట నాటకం
కోలారు: కాశీ, అయోధ్య యాత్ర పేరుతో మహిళల నుంచి డబ్బులు వసూలు చేసి వంచన చేసిన ఘటన కోలారు తాలూకాలోని వడగూరు వెలుగు జూసింది. డబ్బులు పోగొట్టుకున్న మహిళలు శాపనార్థాలు పెడుతున్నారు. అబ్బణి శంకరప్ప అనే ఏజెంటు ఉత్తర భారత యాత్ర అని చెప్పి 28 మంది మహిళల వద్ద నుంచి తలా రూ.3,500 వసూలు చేశాడు. యాత్రకయ్యే మిగిలిన ఖర్చును కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని నమ్మించాడు. వడగూరుకి చెందిన వెంకటమ్మ అనే మహిళను ముఖ్యస్థురాలిగా చేసుకుని వడగూరు, మాలూరు, హొసకోట, కోలారు తదితర ప్రాంతాల నుంచి 28 మంది మహిళల నుంచి డబ్బులు సేకరించాడు. ఆరు నెలలు గడిచినా యాత్రకు తీసుకు వెళ్లకపోవడంతో మహిళలు శంకరప్పను ప్రశ్నించారు. దీంతో సోమవారం రాత్రికి బంగారుపేట రైల్వే స్టేషన్‌కు రావాలని, అక్కడి నుంచి రైలులో తీసుకు వెళతానని తెలిపాడు. దీంతో మహిళలు లగేజీతో సహా చేరుకున్నారు. శంకరప్పకు కాల్ చేస్తే స్విచాఫ్ అని వచ్చింది. మహిళలు తాము మోసపోయామని తెలుసుకున్నారు. స్థానికులు ఏమైందని ఆరా తీయగా బాధితులు గొల్లుమన్నారు. డబ్బయినా తిరిగి ఇవ్వాలని కోరారు.
వృద్ధ మహిళలకు ఏజెంటు మోసం
Comments
Please login to add a commentAdd a comment