డివైడర్‌పైకి దూసుకెళ్లిన ఆటో..డ్రైవర్‌ మృతి | Sakshi
Sakshi News home page

డివైడర్‌పైకి దూసుకెళ్లిన ఆటో..డ్రైవర్‌ మృతి

Published Tue, Dec 26 2023 1:46 AM

-

యశవంతపుర: డివైడర్‌ను ఆటో ఢీకొని డ్రైవర్‌ మృతి చెందాడు. ఈఘటన బెంగళూరు హలసూరు ట్రాఫిక్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో జరిగింది. మాగడి మొయిన్‌ రోడ్డు దొడ్డగోల్లరహట్టి రత్ననగరకు చెందిన చంద్రప్రకాశ్‌(50) సోమవారం వేకువజామున 1.25 గంటలకు క్రేంబ్రిడ్జ్‌ జంక్షన్‌ నుంచి పాత విమానాశ్రయం రోడ్డు ఎసీఎస్‌ సెంటర్‌ జంక్షన్‌ వైపు ఆటోలో వెళ్తుండగా మార్గం మధ్యలో డివైడర్‌ను ఢీకొన్నాడు. సుమారు 38 అడుగుల మేర ఆటో డివైడర్‌పై దూసుకెళ్లింది. ఘటనలో చంద్రప్రకాశ్‌ తల, చేతులు, కాళ్లుకు బలమైన గాయాలయ్యాయి. దారిన వెళ్లేవారు గమనించి ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ 2.15 గంటలకు మృతి చెందాడని హలసూరు ట్రాఫిక్‌ పోలీసులు తెలిపారు. కేసు ద్యాప్తులో ఉంది.

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement