Sakshi News home page

పూరి గుడిసెల్లో ఆనందమయ జీవితం

Published Sun, Nov 19 2023 12:14 AM

మాట్లాడుతున్న కవితా మిశ్రా - Sakshi

రాయచూరు రూరల్‌: ఆధునిక బంగ్లాలకంటే పూరి గుడిసెల్లోనే అనందయమైన జీవితం గడపవచ్చని మహిళా వ్యవసాయ రైతు కవితా మిశ్రా వెల్లడించారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకొని నగరంలోని గిరి అభయాంజనేయ స్వామి అలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన శరణు చింతన సభలో పాల్గొని మాట్లాడారు. పూర్వ కాలం పూరి గుడిసెల్లోనే ఉమ్మడి కుటుంబాలు జీవించేవన్నారు. నేడు పెద్ద కుటుంబాలు విడిపోయి చిన్న కుటుంబాలుగా ఏర్పడి సమస్యలతో జీవనం సాగిస్తున్నారన్నారు. వ్యవసాయాన్ని విస్మరించారని, ప్రతి ఒక్కరూ తమ పిల్లలను వైద్యులు, ఇంజినీర్లు చేసేందుకు తాపత్రయ పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశానికి అన్నం పెట్టే వ్యవసాయానికి ప్రాణం పోయడం అందరి కర్తవ్యమన్నారు.

Advertisement

What’s your opinion

Advertisement