విద్యుత్‌ అంతరాయంతో కోళ్లు మృతి | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ అంతరాయంతో కోళ్లు మృతి

Published Sat, May 25 2024 12:10 AM

విద్య

ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): పౌల్ట్రీ కోళ్లఫాంకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయి వెయ్యి కోళ్లు మృతిచెంది రూ.3లక్షల నష్టం వాటిల్లిన సంఘటన శుక్రవారం ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో చోటు చేసుకుంది. బాధిత పౌల్ట్రీరైతు తెలిపిన వివరాలు. రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన సద్ది రాజిరెడ్డికి గల పౌల్ట్రీఫామ్‌లో 4వేల కోళ్లు ఉన్నాయి. పౌల్ట్రీఫామ్‌కు సమీపంలోని విద్యుత్‌ స్తంభం వంగిపోగా.. దాన్ని మరమ్మతు చేసే క్రమంలో విద్యుత్‌ అధికారులు కరెంట్‌ సరఫరాను నిలిపివేశారు. ఈ విషయం పౌల్ట్రీరైతు రాజిరెడ్డికి తెలపలేదు. వరుసగా నాలుగు గంటలు కరెంట్‌ నిలిచిపోవడంతో దాదాపు వెయ్యి వరకు కోళ్లు చనిపోయాయి. సెస్‌ అధికారులు ముందస్తు సమాచారం ఇస్తే ఫామ్‌ వద్ద జనరేటర్‌ ఏర్పాటు చేసుకునేవాడినని రాజిరెడ్డి పేర్కొన్నారు. తనకు భారీ నష్టం జరిగిందని విద్యుత్‌శాఖ అధికారులు ఇప్పించాలని కోరారు. బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య, పార్టీ మండలాధ్యక్షుడు సద్ది లక్ష్మారెడ్డి పౌల్ట్రీఫామ్‌ను పరిశీలించి, బాధిత రైతును సెస్‌ సంస్థ ఆదుకోవాలని కోరారు.

పౌల్ట్రీరైతుకు రూ.3లక్షలు నష్టం

విద్యుత్‌ అంతరాయంతో కోళ్లు మృతి
1/1

విద్యుత్‌ అంతరాయంతో కోళ్లు మృతి

Advertisement
 
Advertisement
 
Advertisement