నమ్మించి.. నట్టేట ముంచి | Sakshi
Sakshi News home page

నమ్మించి.. నట్టేట ముంచి

Published Sat, May 25 2024 12:10 AM

-

వేములవాడ: వేములవాడ పట్టణానికి చెందిన పూజారి మహేశ్‌ రూ.2కోట్లతో ఉడాయించిన ఘటనలో ఇరుక్కున్న బాధితులు బావురుమంటున్నారు. ఈనెల 4 నుంచి పూజారి ఆచూకీ కోసం నిత్యం అతని ఇంటి చుట్టూ తిరుగుతున్నారు. తమ డబ్బులే కాకుండా బంధువులు, మిత్రుల వద్ద తీసుకొచ్చి మహేశ్‌కు అప్పగించామని, ఇప్పుడు వారికి తామే జవాబుదారీగా ఉండాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక చాలా మంది మధ్యవర్తిగా ఉండి అప్పులు ఇప్పించి జమానత్‌, ష్యూరిటీ సంతకాలు చేసి ఇబ్బందులు పడుతున్నారు. పోలీసులు ప్రత్యేక శ్రద్ధ చూపితే తప్ప తమ సమస్యకు పరిష్కారం లభించేలా లేదని బాధిత కుటుంబాలు వేడుకుంటున్నాయి. ఇప్పటికే బాధితుల గోడు విన్న పోలీసులు ఫిర్యాదులు స్వీకరించి విచారణ ముమ్మరంగా చేపట్టారు.

బావురుమంటున్న బాధితులు

పోలీసులపైనే ఆశలు

బంధువుల డబ్బులు పూజారికిచ్చి అవస్థలు

Advertisement
 
Advertisement
 
Advertisement