రెంజల్: మండలంలోని కిసాన్‌తండా వద్ద మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. మండలంలోని కూనేపల్లి గ్రామానికి చెందిన రొడ్డ సాయికుమార్ ద్విచక్ర వాహనంపై నవీపేట్ నుంచి కూనేపల్లి గ్రామానికి వస్తుండగా కూనేపల్లి నుంచి నవీపేట్‌కు వెళ్తున్న ఆటో ఢీకొంది. ప్రమాదంలో సాయికుమార్‌కు తీవ్రగాయాలైనట్లు స్థానికులు తెలిపారు. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం నిజామాబాద్‌కు తరలించారు. యువకుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు గ్రామస్తులు తెలిపారు.
కారు ఢీకొని ఒకరికి..
మోపాల్: మండలంలోని మంచిప్ప శివారులో గల గండి మైసమ్మ దేవాలయం వద్ద జరిగిన రోడ్డు ప్ర మాదంలో సింగంపల్లికి చెందిన రషీద్‌కు గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రషీద్ గ్రామాలు తిరుగుతూ పాత సామగ్రిని సేకరిస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇదే క్రమంలో బుధ వారం శ్రీరాం నగర్ తండాలో తిరిగి మంచిప్ప రో డ్డు పైకి వస్తుండగా గుర్తు తెలియని కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. ప్రమాదంలో రషీద్‌కు తీవ్ర గా యాలయ్యాయి. స్థానికులు గమనించి ఆస్పత్రికి తరలించారు.రషీద్ బావ షేక్ గౌస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై గంగాధర్ తెలిపారు.
ట్రాన్స్‌ఫార్మర్ చోరీ
నందిపేట్: మండలంలోని సీహెచ్ కొండూర్ ఎత్తిపోతల పథకం మొదటి పంప్‌హౌస్ వద్ద గల సబ్‌స్టేషన్‌లోని విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ చోరీకి గురైంది. వర్షాకాలం రానున్న నేపథ్యంలో ఎత్తిపోతల కమిటీ సభ్యులు పంపుహౌజ్‌లోని మోటార్లను పరిశీలించేందుకు మొదటి పంపుహౌజ్ వద్దకు వెళ్లారు. ప క్కనే గల సబ్‌స్టేషన్ సమీపంలో ట్రాన్స్‌ఫార్మర్ వ్య ర్థ సామగ్రి పడడంతో అనుమానం వచ్చి చూడగా ట్రాన్స్‌ఫార్మర్లు ధ్వంసమయ్యాయి. ట్రాన్స్‌ఫార్మర్లు ధ్వంసం చేసి కాపరు వైరు, ఆయిల్ గుర్తుతెలియని దుండగులు ఎత్తుకెళ్లినట్లు గమనించారు. సబ్‌స్టేషన్ బయట కాపర్ వైరు ఉండే సామగ్రి పడేశారు. తల్వేద ఎత్తిపోతల కమిటీ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఈ విషయమై ఎస్సై రాహుల్‌ను సంప్రదించగాస్పందించలేదు.
బోధన్‌లో మృతదేహం లభ్యం
బోధన్‌టౌన్: బోధన్ శివారులోని బాబా గార్డెన్ సమీపంలో మంగళవారం రాత్రి మృతదేహం లభిందని పట్టణ సీఐ వీరయ్య తెలిపారు. వివరాలు.. బోధన్ మండలం అమ్దాపూర్ గ్రామానికి చెందిన శంకర్(45) ఈ నెల 8న ఇంట్లో నుంచి వెళ్లాడు. మంగళవారం రాత్రి పట్టణ శివారులో కుళ్లిన స్థితిలో శంకర్ మృతదేహం లభించింది. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. శంకర్ ఫిట్స్ వచ్చి చనిపోయి ఉంటాడని భావిస్తున్నారు. శంకర్ కొద్దిరోజుల క్రితం బాబా గార్డెన్ వద్దగల హోటల్‌లో పనిచేశాడని చెప్పారు. మృతుడికి భార్య అమిత, ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment