మోపాల్: మండల కేంద్రంలోని గోపు మహేశ్‌ను కుల బహిష్కరణ చేశారని వచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై గంగాధర్ బుధవారం గ్రామంలో విచారణ చేపట్టారు. బాధితుడు మహేశ్ మాట్లాడుతూ.. సుమారు 25 ఏళ్ల క్రితం తాను అరి సందు(ఖాళీ స్థలం) వదిలి ఇళ్లు కట్టుకున్నానని చెప్పారు. ఇంటి వెనకాల గల మున్నూరుకాపు సంఘానికి ప్రహరీ నిర్మించేందుకు కుల పెద్దలు నిర్ణయం తీసుకున్నారు. తాను వదిలిన స్థలంలో (అరి సందు) తన గోడకు ఆనుకుని ప్రహరీ నిర్మిస్తామనడంతో అడ్డు చెప్పినట్లు తెలిపాడు. వారు చెప్పినట్లు వినడం లేదని సంఘం పెద్దలు కుల బహిష్కరణ చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో మనస్తాపానికి గురైన తన తండ్రి గంగాధర్ మే 6న మృతి చెందాడన్నారు. ఈ విషయం కులం పెద్ద మనుషులకు సమాచారమిచ్చినా.. అంత్యక్రియలకు హాజరు కాలేదన్నారు. తన అక్కను గ్రామానికి చెందిన లచ్చన్నకు ఇచ్చి వివాహం చేశామని, వారిని కూడా అంత్యక్రియలకు రాకుండా అడ్డుకున్నారని మహేశ్ చెప్పాడు. రూ.50వేలు జరిమానా విధిస్తామని బెదిరించడంతో అక్క మాత్రమే అంత్యక్రియలకు వచ్చిందన్నారు. తనను కుల బహిష్కరణ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
Comments
Please login to add a commentAdd a comment