డెంగీ నివారణకు కదులుదాం | - | Sakshi
Sakshi News home page

డెంగీ నివారణకు కదులుదాం

Published Thu, May 16 2024 3:25 PM | Last Updated on Thu, May 16 2024 3:25 PM

-

నిజామాబాద్‌నాగారం: డెంగీతో ఎంతో మంది మంచాన పడుతున్నారు.. మరికొంతమంది భయంతో చనిపోతున్నారు. జిల్లాలో డెంగీ కేసులు జనవరి నుంచి ఇప్పటి వరకు 115 నమోదయ్యాయి. గతేడాది 356 కేసులు నమోదయ్యాయి. ప్రాణాంతకమైన ఈ వ్యాధి నివారణకు జాగ్రత్తలు అవసరం. జాతీయ డెంగీ దినోత్సవం సందర్భంగా కథనం..

వ్యాధి లక్షణాలు

● డెంగీ వ్యాధి ఎడిస్‌ దోమ కుట్టడంతో వ్యాప్తి చెందుతుంది.

● తీవ్రమైన జ్వరం రావడం, తలనొప్పి, కండరాలు, కీళ్లనొప్పులు వస్తాయి.

● కళ్ల వెనుక భాగంలో తీవ్రమైన నొప్పి, ఆకలి మందగించడం, శరీరంపై దద్దుర్లు రావడం,

వికారం, వాంతులు.

● ప్రభుత్వ ఆస్పత్రుల్లో ‘ఎలీసా’ పద్ధతిలో జరిపే రక్త పరీక్ష ద్వారా డెంగీ వ్యాధిని నిర్ధారించవచ్చు.

● ఏడిస్‌ దోమలు ఎక్కువగా పగలు కుడతాయి. ఈ దోమలు ఇంటి పరిసరాలలో నిల్వ ఉన్న నీటిలో పెరుగుతాయి.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

● పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూడాలి.

● నిల్వ నీటిలో ఆయిల్‌ బాల్స్‌ వేయాలి.

● ఓవర్‌ హెడ్‌ ట్యాంకులు, సంపులు, డ్రమ్ములు, నీటి తోట్ల మీద మూతలు పెట్టాలి.

● ఇళ్లలోకి దోమలు రాకుండా చర్యలు తీసుకోవాలి.

● ప్రభుత్వం డెంగీపై ప్రజలకు అవగాహన

కల్పించాలి.

● వ్యాధి ప్రబలకుండా చర్యలు తీసుకోవాలి

నేడు అవగాహన ర్యాలీ

జాతీయ డెంగీ దినోత్సవం సందర్భంగా ప్రజ లకు అవగాహన కల్పించడానికి గురువారం అ వగాహన ర్యాలీ నిర్వహిస్తున్నాం. దోమల నివా రణకు ప్రతి శుక్రవాం డ్రైడేగా పాటిస్తున్నాం.

– తుకారాం రాథోడ్‌, ఇన్‌చార్జి డీఎంహెచ్‌వో

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement