ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డికి చెందిన ఉబ్బి పూజితపై దాడి చేసిన ఆమె భర్త సాయిబాబాపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై మహేశ్ బుధవారం తెలిపారు. వివరాలు.. ఈ నెల 2న పూజిత, సాయిబాబా మధ్య గొడవ జరిగింది. దీంతో సాయిబాబా తన భార్య పూజితపై పైపుతో దాడి చేసి గాయపర్చాడు. పూజిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.
పీడీఎస్ బియ్యం పట్టివేత
కామారెడ్డి టౌన్: కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని దేవునిపల్లి వద్ద పీడీఎస్ బియ్యాన్ని టాస్క్‌ఫోర్స్, దేవునిపల్లి పోలీసులు పట్టుకున్నారు. అక్రమంగా తరలిస్తున్న దాదాపు పది క్విటాంళ్లు బియ్యం పట్టుకున్నట్లు దేవునిపల్లి ఎస్సై రాజు తెలిపారు. ఆటో డ్రైవర్, క్లీనర్‌ను ఆదుపులోకి తీసుకుని విచారణ జరుతున్నట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment