ధాన్యం కొనుగోళ్లు వేగంగా పూర్తి చేయాలి
కామారెడ్డి క్రైం: ధాన్యం కొనుగోళ్లు వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో బుధవారం ధాన్యం కొనుగోళ్లపై జిల్లా పౌరసరఫరాలు, సహకార శాఖల అధికారులు, రైస్ మిల్ అసోసియేషన్ ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున కొనుగోలు కేంద్రంలో ధాన్యం నిలువలు లేకుండా చూడాలన్నారు. ఎప్పటికప్పుడు ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించాలన్నారు. రైస్‌మిల్ యజమానులు వెంటవెంటనే అన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని బాయిల్డ్ మిల్లులకు తరలించాలని అధికారులను ఆదేశించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని తక్షణమే రైస్ మిల్లులకు తరలించాలని, రవాణా కోసం లారీల సంఖ్య పెంచాలని, ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రమోహన్, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి మల్లికార్జున బాబు, ఇన్‌చార్జి డీఎం నిత్యానందం, సహకార శాఖ అధికారులు, రైస్ మిల్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.
ధాన్యాన్ని మిల్లులకు తరలించాలి
కామారెడ్డి క్రైం: కొనుగోలు కేంద్రాల్లో పేరుకుపోయిన ధాన్యం బస్తాలను వెంటనే మిల్లులకు తరలించాలని పలువురు సింగిల్ విండో చైర్మన్ కోరారు. మంగళవారం కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. కొనుగోలు కేంద్రాలలో వేల సంఖ్యలో బస్తాలు తూకం పూర్తి చేసుకుని మిల్లులకు తరలించడానికి సిద్ధంగా ఉన్నాయన్నారు. లారీలు సకాలంలో రాకపోవడంతో ఇబ్బంది ఎదురవుతోందని పేర్కొన్నారు. వర్షాలు పడే అవకాశం ఉన్నందున రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు. వెంటనే లారీలను తెప్పించి, ధాన్యాన్ని తరలించాలని కోరారు. కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్‌లు నల్లవెల్లి అశోక్, తిరుపతి, వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆదేశం
Comments
Please login to add a commentAdd a comment