Sakshi News home page

తగ్గుతున్న ఎస్సారెస్పీ నీటిమట్టం

Published Mon, Apr 15 2024 1:25 AM

ఎస్సారెస్పీలో ప్రస్తుతం నిల్వ ఉన్న నీరు   - Sakshi

బాల్కొండ: యాసంగీ సీజన్‌లో ఆయకట్టుకు చివరి తడిగా కాలువల ద్వారా నీటి విడుదల కొనసాగుతుండటంతో శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌ నీటి మట్టం వేగంగా తగ్గుతోంది. మూడు రోజులుగా కాలువల ద్వారా నీటి విడుదల చేస్తున్నారు. రోజుకు 0.4 టీఎంసీల చొప్పున ఇది వరకే 1.2 టీఎంసీల నీరు ఖాళీ అయింది. కాకతీయ కాలువ ద్వారా ఐదు వేల క్యూసెక్కులు, లక్ష్మికాలువ ద్వారా 200 క్యూసె క్కులు, సరస్వతి కాలువ ద్వారా 300 క్యూసె క్కులు, ఆవిరి రూపంలో 271 క్యూసెక్కులు, తాగు నీటి అవసరాలకు 231 క్యూసెక్కుల నీరు పోతుంది. ప్రాజెక్ట్‌ పూర్తి స్థాయి నీటి మట్టం 1,091 (90 టీఎంసీలు) అడుగులు కాగా ఆదివారం సాయంత్రానికి ప్రాజెక్ట్‌లో 1,058.30 (11.4టీఎంసీలు) అడుగుల నీరు నిల్వ ఉందని ప్రాజెక్ట్‌ అధికారులు తెలిపారు.

Advertisement
Advertisement