Sakshi News home page

అకాల వర్షంతో నష్టం

Published Sun, Apr 14 2024 2:10 AM

రాంపూర్‌ శివారులో కొట్టుకుపోయిన ధాన్యాన్ని ఎత్తుతున్న రైతులు  - Sakshi

సాక్షి నెట్‌వర్క్‌ : అకాల వర్షాలతో అన్నదాత ఆగం అవుతున్నాడు. శుక్రవారం రాత్రి, శనివారం కురిసి న వర్షాలతో పంటలు తడిసిపోవడంతో ఆందోళన చెందుతున్నాడు. నిజాంసాగర్‌, మహమ్మద్‌నగర్‌, పిట్లం, పెద్దకొడప్‌గల్‌, బిచ్కుంద, బాన్సువాడ, బీ ర్కూర్‌, నస్రుల్లాబాద్‌, లింగంపేట తదితర మండలాలలో శుక్రవారం రాత్రి, శనివారం వర్షం కురిసింది. దీంతో నూర్పిడి చేసి ఆరబెట్టిన వడ్లు వరదలో కొట్టుకుపోయాయి. బలమైన గాలులు వీయడంతో వరి, మొక్కజొన్న పంటలు నేలవాలాయి. ఆర బోసిన ధాన్యంలో నిలిచిన నీటిని ఎత్తిపోయడానికి రైతులు నానా పాట్లు పడ్డారు. కొనుగోలు కేంద్రాల వద్ద టార్పాలిన్లు అందుబాటులో లేకపోవడంతో వర్షానికి ధాన్యం తడిసిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, తూకంలో జాప్యం లేకుండా చూడాలని, పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు.

Advertisement
Advertisement