Sakshi News home page

కరెంట్‌ కావాలా.. కాంగ్రెస్‌ కావాలా!?

Published Fri, Nov 10 2023 5:18 AM

మాట్లాడుతున్న బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ - Sakshi

ఆర్మూర్‌ : వ్యవసాయరంగానికి మూడు గంటల కరెంట్‌ ఇస్తామంటున్న కాంగ్రెస్‌ కావాలో..24 గంటల పాటు విద్యుత్‌ ఇస్తున్న బీఆర్‌ఎస్‌ కావాలో ప్రజలే తేల్చుకోవాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రసిడెంట్‌ కేటీఆర్‌ పిలుపునిచ్చారు. బీఆర్‌ఎస్‌ పార్టీ ఆర్మూర్‌ నియోజకవర్గం అసెంబ్లీ అభ్యర్థి జీవన్‌రెడ్డి నామినేషన్‌ దాఖలు కార్యక్రమానికి మంత్రి కేటీఆర్‌ పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత మూడో పర్యాయం జరుగుతున్న ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఒంటరిగానే పోటీలో నిలిచిందన్నారు. కేసీఆర్‌ అనే సింహం సింగిల్‌ గానే వస్తున్నాడన్నారు. బక్కపలచని సీఎం కేసీఆర్‌ను గద్దెదించడం కోసం అన్ని పార్టీలు ఏకమై మందగా వస్తున్నారని ఎద్దేవా చేశారు. కర్ణాటక నుంచి కాంగ్రెస్‌ పార్టీ, గుజరాత్‌ నుంచి బీజేపీ పంచి పెట్టే డబ్బుల మాయలో పడొద్దని కోరారు. కారు ఉండగా బేకారు కావద్దంటూ పాలిచ్చే గేదెను అమ్మి కడుపులో పొడిచే దున్న పోతును కొనుక్కుందామా అని ప్రశ్నించారు. కేసీఆర్‌ను గద్దె దింపడం కోసం మోడీ, అమిత్‌షా, పదిహేను మంది సీఎంలు, 20 మంది కేంద్రమంత్రులు, యోగి, ఖర్గే, రా హుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ, సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌ వస్తున్నారన్నారు. తెలంగాణ కోసం ప్రశ్నించే కేసీఆర్‌ అనే ఏకై క గొంతు కోసేందుకు గో తులు తొవ్వుతున్నారన్నారు. కాంగ్రెస్‌ పార్టీకి 11సార్లు అవకాశమిస్తే 55ఏళ్లు రాష్ట్రాన్ని పాలించి కరెంటు, సాగు, తాగు నీళ్లివ్వకుండా అరిగోస పెట్టి ఇప్పుడు మళ్లీ ఒక్క చాన్స్‌ అంటూ రావడం సిగ్గుచేటన్నారు. బీఆర్‌ఎస్‌ మేని ఫెస్టో తెలంగాణ బతుకు చిత్రం మారుస్తుందని దీమా వ్యక్తం చేశారు. రూ. 16 వేలకు రైతుబంధు పెంపుతో వ్యవసాయం మరింత బలోపేతం కానుందన్నారు. సౌభాగ్యలక్ష్మి ద్వారా మహిళలకు ప్రతినెల రూ. 3 వేల భృతి ఇవ్వనున్నామన్నారు. ఆసరా పెన్షన్లు రూ. 5 వేలకు పెంపుతో ప్రతి ఇంట్లో సంతోషం కనిపిస్తోందన్నారు. అర్హులైన వారందరికీ రూ. 400 కే సిలిండర్‌ అందజేస్తామన్నారు. బీసీల పథకాలు, దళితబంధు పథ కం ఎప్పటిలాగే కొనసాగుతాయన్నారు. జీవన్‌రెడ్డికి హ్యాట్రిక్‌ విజయం కట్టబెట్టడానికి కారు గుర్తుకే ఓ టేయాలన్నారు. మీ కుటుంబ సభ్యుడిలా ఉన్న జీవన్‌రెడ్డి హాట్రిక్‌ విజయం కోసం కారు గుర్తుకు ఓటు వేయాలన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి జీవన్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు సురేష్‌రెడ్డి, జీవన్‌రెడ్డి సతీమణి రజితరెడ్డి, రాజారాం యాదవ్‌ తదితరులున్నారు.

టేక్‌ కేర్‌ రామన్న..

ట్విట్టర్‌లో ఎమ్మెల్సీ కవిత పోస్ట్‌

నిజామాబాద్‌ నాగారం: ఆర్మూర్‌లో గురువారం బీఆర్‌ఎస్‌ అభ్యర్థి జీవన్‌రెడ్డి నామినేషన్‌ ర్యాలీలో పాల్గొన్న కేటీఆర్‌ ప్రచార రథం రెయిలింగ్‌ విరగగా కిందికి జారిపోయారు. దీంతో కేటీఆర్‌ ఆరోగ్య పరిస్థితిపై తాను వాకబు చేశానని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ప్రచారంలో జాగ్రత్తగా ఉండాలని..రెట్టింపు ఉత్సాహంతో ముందుకెళ్లాలని పేర్కొన్నారు. టేక్‌కేర్‌ రామన్నా.. అంటూ సంబోధించారు.

బీజేపీ, కాంగ్రెస్‌ మాయలో పడొద్దు

మరింత అభివృద్ధి కోసం

జీవన్‌రెడ్డినే గెలిపించాలి

నామినేషన్‌ కార్యక్రమంలో

మంత్రి కేటీఆర్‌

Advertisement
Advertisement