హష్‌మనీ కేసు.. ట్రంప్‌నకు ఎదురుదెబ్బ | Setback To Donald Trump In Hush Money Case | Sakshi
Sakshi News home page

హష్‌మనీ కేసు.. ట్రంప్‌నకు ఎదురుదెబ్బ

Dec 17 2024 8:03 AM | Updated on Dec 17 2024 11:12 AM

Setback To Donald Trump In Hush Money Case

న్యూయార్క్‌:రెండోసారి అమెరికా అధ్యక్ష పదవి చేపట్టనున్న ట్రంప్‌నకు హష్‌ మనీ' కేసులో ఎదురుదెబ్బ తగిలింది. పోర్న్‌స్టార్‌ స్టార్మీ డేనియల్స్‌కు అనధికారికంగా సొమ్ములు చెల్లించిన కేసులో తనకు ఉపశమనం కల్పించాలని ట్రంప్‌ తాజాగా కోర్టును అభ్యర్థించారు.

ట్రంప్‌ చేసిన ఈ విజ్ఞప్తిని న్యూయార్క్‌ కోర్టు జడ్జి తిరస్కరించారు. అధ్యక్షులకు రక్షణ అధికారిక చర్యలకు మాత్రమే ఉంటుందని  న్యాయమూర్తి జువాన్‌ మర్చన్‌ స్పష్టం చేశారు. అనధికార ప్రవర్తనకు రక్షణ వర్తించదని వ్యాఖ్యానించారు.

పోర్న్‌స్టార్‌ స్టార్మీ డేనియల్స్‌తో ఏకాంతంగ గడిపి ఈ విషయం బయటికి చెప్పకుండా ఉండేందుకు ఆమెకు అనధికారికంగా చెల్లింపులు చేశారని ట్రంప్‌పై కేసు రుజువైంది. ఈ కేసులో ట్రంప్‌ దోషిత్వం రుజువైనప్పటికీ శిక్ష ఇంకా ఖరారు కాలేదు. ఇటీవల జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన ట్రంప్‌ జనవరి 20న రెండోసారి అధ్యక్షునిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.

	ట్రంప్‌నకు హష్‌ మనీ కేసులో ఎదురుదెబ్బ

 

 

Advertisement
 
Advertisement
Advertisement