కరోనా: రెండున్నర నెలల్లో ఇదే అత్యధికం | Coronavirus: 1592 News Cases Registered In US | Sakshi
Sakshi News home page

కరోనా: ఒక్క రోజులో 60,000 కేసులు, 1592 మంది మృతి

Jul 29 2020 10:11 AM | Updated on Jul 29 2020 10:11 AM

Coronavirus: 1592 News Cases Registered In US - Sakshi

వాషింగ్టన్‌ : అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వైరస్‌ విలయతాండవం కొనసాగుతోంది. పాజిటివ్‌ కేసులతో పాటు మరణాల సంఖ్య రోజు రోజుకి భారీగా పెరిగిపోతోంది. మంగళవారం ఒక్క రోజే రికార్డు స్థాయిలో 1,592 మంది మృతి చెందారు. గత రెండున్నర నెలల్లో ఒకే రోజు ఇంతమంది మరణించడం ఇదే తొలిసారి. దేశ వ్యాప్తంగా క‌రోనా బారిన పడి ఇప్ప‌టివ‌ర‌కు 1,52,320 మంది ప్రాణాలు కోల్పోయారు. మంగ‌ళ‌వారం కొత్త‌గా 60 వేల పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. దీంతో మొత్తం క‌రోనా కేసులు 44,98,343కు చేరాయి. కరోనా మహమ్మారి బారి నుంచి 21,85,894 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 21,60,129 మంది చికిత్స పొందుతున్నారు.
(చదవండి : మాస్కు పెట్టుకోమన్నందుకు చాతి కొరికాడు)

ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఇప్ప‌టివ‌ర‌కు 1,68,83,791 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. మంగళవారం ఒక్క‌రోజే కొత్త‌గా 2,47,579 మంది క‌రోనా బారిన‌ప‌డ్డారు. క‌రోనా వ‌ల్ల మంగ‌ళ‌వారం 5,567 మంది మ‌ర‌ణించారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య‌ 6,62,481కు చేరింది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా 57,70,258 యాక్టివ్ కేసులు ఉండగా, 1,04,51,052 మంది కోలుకున్నారు.
(చదవండి :  రెండు నెలలు బట్టలు ఉతకలేదు, ఆపై...)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement