ఓటేసి వెళ్లండి | - | Sakshi
Sakshi News home page

ఓటేసి వెళ్లండి

Published Thu, Nov 30 2023 4:48 AM | Last Updated on Thu, Nov 30 2023 4:48 AM

- - Sakshi

అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ సర్వం సిద్ధమైంది. నగరవాసులు ఓటెత్తడమే తరువాయి మిగిలింది. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశాం. నేటి ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. పోలింగ్‌ ప్రశాంతంగా జరిగేందుకు తగిన చర్యలు తీసుకున్నాం. అన్ని పోలింగ్‌ కేంద్రాల్లోనూ వెబ్‌కాస్టింగ్‌ ఏర్పాట్లు చేశాం. సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించిన 652 పోలింగ్‌ కేంద్రాల ఆవరణల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశాం. ఈవీఎంలు తదితర ఎన్నికల సామగ్రిని అధికారులు పోలింగ్‌ కేంద్రాలకు తరలించాం. అవసరమైన ఏర్పాట్లన్నీ చేశాం, వచ్చి ఓటేసి వెళ్లమని కోరుతున్నాం.

– రోనాల్డ్‌రాస్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement