సంఘం | - | Sakshi
Sakshi News home page

సంఘం

Published Sat, Nov 18 2023 6:42 AM | Last Updated on Sat, Nov 18 2023 6:42 AM

- - Sakshi

శరణం గచ్ఛామి!

నగర శివారు రంగారెడ్డి, మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లాల్లోని గ్రామ సంఘాలు, స్వయం సహాయక మహిళా గ్రూపులు.. వీటిలోని సభ్యుల వివరాలు ఇలా..

జిల్లా గ్రామ సంఘాలు స్వయం సహాయక సభ్యులు

సంఘాలు

రంగారెడ్డి 788 19,192 2,06,691

మేడ్చల్‌–మల్కాజిగిరి 118 3,378 36,282

మొత్తం 906 22,570 2,42,973

సాక్షి, మేడ్చల్‌ జిల్లా: మహిళా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. గెలుపే లక్ష్యంగా వ్యక్తిగతంగా వీరిని కలవడంతో పాటు సంఘాలతో ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేస్తూ వారి మద్దతు కోరుతున్నారు. ఈ క్రమంలో మహిళా సంఘాలను ప్రసన్నం చేసుకోవడంపై నేతలు మరింత కసరత్తు చేస్తున్నారు. మహిళా సంఘాల సానుకూలత ఉంటే.. వారి మద్దతు దొరకడంతోపాటు గ్రామాల్లో, కాలనీల్లో వారి ద్వారా చుట్టుపక్కల వారిని ప్రభావితం చేసే అవకాశం ఉండటంతో అభ్యర్థులు వీరి మద్దతుపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు.

హామీలు గుప్పిస్తూ..

● నగర శివారుల్లోని మేడ్చల్‌–మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల్లో మొత్తంగా 36 మండలాలు ఉండగా.. ఎక్కువ మంది సభ్యులు ఉన్న గ్రామాల్లోని బృందాలకు ప్రధాన పార్టీల నేతలు, అభ్యర్థులు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. స్వయం సహాయక మహిళా సంఘాల డిమాండ్లకు అనుగుణంగా హామీలు గుప్పిస్తున్నారు. తాము సూచించిన అభ్యర్థికి మద్దతుగా నిలబడటమే కాకుండా వారి బంధుమిత్రుల ఓట్లను కూడా పొందేలా పర్యవేక్షించాలని కోరుతున్నారు. కొందరు వ్యక్తిగత హామీలు కోరుతుండగా.. మరికొందరు గ్రామాల్లో తమకు ప్రత్యేకంగా భవనాలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి నాయకులు ముఖ్యంగా పార్టీల అభ్యర్థులు కూడా ఒప్పుకొంటూ వారి మద్దతు కూడగట్టుకుంటున్నారు.

● ఈ నేపథ్యంలోనే కొన్ని సంఘాల మహిళలు బహిరంగంగా ముందుకు వచ్చి మద్దతు ప్రకటిస్తుండగా.. ఇంకొన్ని సంఘాల వారు లోపాయికారీగా మద్దతు ఇస్తామని పేర్కొంటున్నారు. మహిళలు మెచ్చేలా బహుమతులు, గిఫ్టులు కూడా సంఘాలకు చేరేలా.. కొన్ని పార్టీల అభ్యర్థులు కసరత్తు చేస్తున్నారు. మద్ధతు కూడగట్టడమే లక్ష్యంగా ఎత్తులకు పైఎత్తులతోపాటు వ్యూహా ప్రతివ్యూహాలతో ప్రధాన పార్టీలు ఆ సంఘాల సభ్యులను ఆకర్షించే ప్రయత్నంతోపాటు ఓట్లు రాబట్టేలా సర్వశక్తులూ ఒడ్డుతున్నట్లు సమాచారం. మహిళా సంఘాల వారీగా బ్యాంకు అకౌంట్లను తీసుకోవటం ద్వారా సహాయక సహాకారాలు అందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

సామాజిక వర్గాల వారీగా సంఘాలిలా..

నగర శివారు మేడ్చల్‌–మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల్లో మొత్తం 906 గ్రామ సంఘాలు 22,570 స్వయం సహాయక సంఘాలు ఉండగా 2,42,973 మంది సభ్యులు ఉన్నారు. ఇందులో ఎస్సీ స్వయం సహాయ మహిళా సంఘాలు 5,168 ఉండగా, 50,212 మంది సభ్యులు ఉన్నారు. ఎస్టీ స్వయం సహాయక మహిళా సంఘాలు 2,180 ఉండగా, 25,379 మంది సభ్యులు ఉన్నారు. మైనార్టీ స్వయం సహాయ మహిళా సంఘాలు 656 ఉండగా,10,001 మంది సభ్యులు ఉన్నారు. బీసీ స్వయం సహాయక సంఘాలు 13,223 ఉండగా.. ఇందులో 1,31,346 మంది సభ్యులు ఉన్నారు. ఓసీ స్వయం సహాయక మహిళా సంఘాలు 1,342 మంది ఉన్నారు. ఇందులో 20,846 మంది సభ్యులు ఉన్నారు. ఇప్పటికే అధికార బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ అభ్యర్థులు వీరికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తూ.. మద్దతును కూడగట్టేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.

మహిళా సంఘాల మద్దతు కోసం ప్రయత్నాలు

అతివల ఓట్లపై ప్రధాన పార్టీల వ్యూహ ప్రతివ్యూహాలు

గ్రేటర్‌ జిల్లాల పరిధిలో 906 గ్రామ సంఘాలు

22,570 సహాయక సంఘాలు.. 2.42 లక్షల మంది సభ్యులు

తాయిలాలు, హామీలతో ఆకట్టుకునేందుకు నేతల యత్నం

No comments yet. Be the first to comment!
Add a comment
1/2

2/2

Advertisement
 
Advertisement
 
Advertisement