బీఆర్‌ఎస్‌కు డబ్బికార్‌ రాంరాం | - | Sakshi
Sakshi News home page

బీఆర్‌ఎస్‌కు డబ్బికార్‌ రాంరాం

Published Thu, Nov 16 2023 6:27 AM | Last Updated on Thu, Nov 16 2023 6:27 AM

డబ్బికార్‌ శ్రీనివాస్‌  - Sakshi

ఇబ్రహీంపట్నం: మలిదశ తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గ్గనికి చెందిన డబ్బికార్‌ శ్రీనివాస్‌ బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేశారు. తెలంగాణ ఉద్యమంలో పలు ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొని ఇటు కేసీఆర్‌, అటు కేటీఆర్‌కు సన్నిహితుడిగా మెలిగారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ కోసం ముందుండి పోరాటం చేసిన ఉద్యమకారులను పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టించుకోవడంలేదని ఆయన పలుమార్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో తాజాగా బీఆర్‌ఎస్‌ను వీడుతున్నట్లు ప్రకటించారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇబ్రహీంపట్నం నుంచి నామినేషన్‌ దాఖలు చేసిన ఆయన కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి మల్‌రెడ్డి రంగారెడ్డికి మద్దతుగా బుధవారం నామినేషన్‌ ఉపసంహరించుకున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో చర్చించి కాంగ్రెస్‌ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement