ప్రజా చైతన్యంతోనే ప్రజాస్వామ్య పరిరక్షణ | Sakshi
Sakshi News home page

ప్రజా చైతన్యంతోనే ప్రజాస్వామ్య పరిరక్షణ

Published Sat, Nov 11 2023 4:28 AM

కరపత్రం ఆవిష్కరిస్తున్న ప్రొఫెసర్‌ హరగోపాల్‌  - Sakshi

పంజగుట్ట: తెలంగాణలో ప్రజాస్వామ్య జరిగిందని ప్రొఫెసర్‌ హరగోపాల్‌ అన్నారు. పౌరులు చైతన్యమైనప్పుడే ప్రజాస్వామ్య పరిరక్షణ సాధ్యమన్నారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో భారత్‌ బచావో ఆధ్వర్యంలో రూపొదించిన భూస్వామ్య అహంకారంతో ప్రజా వ్యతిరేక నిరంకుశ పాలన కొనసాగిస్తున్న బిఆర్‌ఎస్‌, దానికి వెన్నుదన్నుగా నిలబడుతున్న ఫాసిస్టు బిజేపీ, రహస్య మిత్రుడైన ఎమ్‌ఐఎమ్‌ల కూటమిని ఓడిద్దాం పేరుతో రూపొందించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్బంగా భారత్‌ బచావో జాతీయ ఉపాధ్యక్షుడు డాక్టర్‌ గోపీనాఽథ్‌తో కలిసి మాట్లాడుతూ .. రెండుసార్లు సెంటిమెంట్‌తో గెలిచిన బీఆర్‌ఎస్‌ తిరిగి అధికారం లోకి రాకపోతే ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఆగిపోతాయని ప్రచారం చేస్తుందన్నారు. ప్రజలు దానిని నమ్మరాదని, అంతకన్నా ఎక్కువ సంక్షేమ పథకాలు అందుతాయన్నారు. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌, ఎంఐఎం మూడు ఒక్కటే అని, ముగ్గురూ కలిసి నాటకం ఆడుతున్నారన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా ఉన్న జేఏసీలు రాష్ట్రం రాగానే నిశ్శబ్దమయ్యాయని దాంతో రాష్ట్రం వచ్చిన 10 సంవత్సరాల్లో పూర్తి విధ్వంసం జరిగిందన్నారు. పౌరహక్కుల సంఘం నేతలకు అపాయింట్‌మెంట్‌ ఇవ్వని ఏకై క ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. పదేళ్లులో ప్రజా సంఘాలను కలవకుండా ఇంట్లో ఉండి పాలన సాగించారని ఆరోపించారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగం ఉంటుందో ఉండదో కూడా తెలియడం లేదన్నారు. భారత్‌ బచావో తరపున ప్రజాస్వామ్యాన్ని రక్షించుకునేందుకు, భావితరాలకు మెరుగైన సమాజం అందించేందుకు కృషి చేస్తామన్నారు. సమావేశంలో సోమయ్య, ముత్తయ్య, సత్యనారాయణ, రాంబాబు, రమేష్‌ బాబు, మచ్చర్ల శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement