సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే చర్యలు: డీఈఓ | Sakshi
Sakshi News home page

సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే చర్యలు: డీఈఓ

Published Sat, May 4 2024 4:00 AM

సెలవుల్లో తరగతులు  నిర్వహిస్తే చర్యలు: డీఈఓ

విద్యారణ్యపురి: జిల్లాలో గుర్తింపు పొందిన అన్ని ప్రైవేట్‌ పాఠశాలల్లో వేసవి సెలవుల్లో క్లాస్‌లు, సమ్మర్‌ క్యాంపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హనుమకొండ డీఈఓ ఎండీ అబ్దుల్‌హై శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జీఓ ఎంఎస్‌ నంబర్‌ 1ని అనుసరిస్తూ పాఠశాలలన్నింటికీ వేసవి సెలవులు జూన్‌ 11 వరకు కొనసాగుతాయని, జూన్‌ 12న రీఓపెన్‌ చేయాల్సి ఉంటుందని తెలిపారు. ప్రైవేట్‌ పాఠశాలల యాజమాన్యాలు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలలను నడిపితే ఆయా పాఠశాలల గుర్తింపును రద్దు చేస్తామని డీఈఓ పేర్కొన్నారు.

ఎన్పీడీసీఎల్‌ ఐపీసీ

అండ్‌ రాక్‌ సీజీఎంగా

తిరుమల్‌రావు

హన్మకొండ: సీజీఆర్‌ఎఫ్‌ వరంగల్‌ ఇన్‌చార్జ్‌ చైర్మన్‌గా కొనసాగుతున్న కె.తిరుమల్‌రావును టీఎస్‌ ఎన్పీడీసీఎల్‌ ఐపీసీ అండ్‌ రాక్‌ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌గా నియమించారు. ఈమేరకు టీఎస్‌ ఎన్పీడీసీఎల్‌ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ కర్నాటి వరుణ్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. బాధ్యతలు స్వీకరించిన తిరుమల్‌రావుకు సీజీఎం (ఆపరేషన్‌) కిషన్‌, జీఎం మల్లికార్జున్‌, డీఈలు బి.సామ్యానాయక్‌, రాంబాబు, శ్రీధరచారి, ఏడీఈలు కిరణ్‌, మధుకర్‌, అశోక్‌, ఈఈ జనార్దన్‌, అధికారులు, ఆయా సంఘాల నాయకులు పుష్పగుచ్ఛం అందించి, శాలువా తో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.

దానం చేసిన భూమి కబ్జాపై

కలెక్టర్‌ సీరియస్‌

హసన్‌పర్తి: మండలంలోని ఎల్లాపురంలో దానం చేసిన భూమి కబ్జాపై కలెక్టర్‌ సీరియస్‌ అయ్యారు. ‘భూదాన పత్రాలు మాయం’ శీర్షికన ‘సాక్షి’లో గురువారం ప్రచురితమైన కథనానికి కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ స్పందించారు. శుక్రవారం అందుకు సంబంధించిన నివేదిక అందించాలని రెవెన్యూ అఽధికారులను ఆదేశించారు. స్థానికంగా అంగడి, చేపల ఉత్పత్తి కేంద్రాలకు ఎన్ని ఎకరాల భూమి దానం చేశారు? అందులో నిర్మాణాలకు సంబంధించిన వివరాలు అందించాలని ఆదేశించినట్లు సమాచారం.

వడదెబ్బ తాగలకుండా

జాగ్రత్తలు : డీఎంహెచ్‌ఓ

ఎంజీఎం: వడదెబ్బకు గురవకుండా ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని హనుమకొండ జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి సాంబశివరావు ఒక ప్రకటనలో సూచించారు. వడదెబ్బకు గురైనప్పుడు శరీర ఉష్ణోగ్రత తీవ్రంగా పెరుగుతుందని, తీవ్రమైన తలనొప్పి, నాలుక ఎండిపోవడం, శరీరంలో నీటి శాతం కోల్పోవడం జరుగుతుందని తెలిపారు. వడదెబ్బకు గురైన వ్యక్తిని వెంటనే నీడ ప్రదేశానికి చేర్చి, శరీరాన్ని చల్లని నీటిలో ముంచిన గుడ్డతో తుడవాలని, ఎండ దెబ్బ తగిలిన వారికి ఉప్పు కలి పిన మజ్జిగ, చల్ల, కొబ్బరి నీళ్లు, నిమ్మరసం, గ్లూకోజ్‌, ఓఆర్‌ఎస్‌ ద్రావణాన్ని అందించాలని పేర్కొన్నారు. ఎండ తీవ్రంగా ఉండే సమయంలో బయట తిరగొద్దని, ఆటలు ఆడొద్దని సూచించారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఎండలోకి వెళ్తే గొడుగు, టోపీ, తెల్లని రుమాలు తప్పక ధరించాలని వివరించారు. పిల్లలు, వృద్ధులు, గర్భిణులు, ఇతర అనారోగ్యంతో బాధపడేవారు వేసవిలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. జిల్లాలోని ప్రతీ ఆరోగ్య కేంద్రం, ఉప కేంద్రం, అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో, గ్రామ పంచాయతీల్లో ఉచితంగా అందించేందుకు ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు అందుబాటులో ఉంచినట్లు వివరించారు. ఎన్నికల విధులు, ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనే వారు తగిన వ్యక్తిగత జాగ్రత్తలు పాటించాలని డీఎంహెచ్‌ఓ సూచించారు.

విద్యుత్‌ ప్రమాదాల్ని

నివారించాలి..

హన్మకొండ: వినియోగదారులు, ఉద్యోగులు విద్యుత్‌ ప్రమాదాల్ని నివారించాలని టీఎస్‌ ఎన్పీడీసీఎల్‌ హనుమకొండ జిల్లా సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌ వెంకటరమణ అన్నారు. శుక్రవారం సాయంత్రం హనుమకొండ బాలసముద్రంలోని హనుమకొండ సెక్షన్‌, మచిలీబజార్‌ సెక్షన్‌లో విద్యుత్‌ భద్రతా వారోత్సవాల్లో భాగంగా అవగాహన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా విద్యుత్‌ భద్రతా వారోత్సవాల పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎన్పీడీసీఎల్‌ హనుమకొండ టౌన్‌ డీఈ జి.సాంబరెడ్డి, హనుమకొండ ఏడీ పి.మల్లికార్జున్‌, ఏఈలు అనూష, మధులిక, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement