వృద్ధులను, దివ్యాంగులను పదేపదే తిప్పుకోవద్దు | Sakshi
Sakshi News home page

వృద్ధులను, దివ్యాంగులను పదేపదే తిప్పుకోవద్దు

Published Tue, Nov 21 2023 2:08 AM

- - Sakshi

కలెక్టర్‌ వేణుగోపాల్‌ రెడ్డి

గుంటూరు వెస్ట్‌: వివిధ పనుల నిమిత్తం ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే సామాన్యులతోపాటు వృద్ధులను, దివ్యాంగులను పదేపదే తిప్పుకోవద్దని, వారి సమస్యలు వినగానే సంబంధిత సిబ్బందికి అప్పగించాలని కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లోని ఎస్‌ఆర్‌ శంకరన్‌ సమావేశ మందిరంలో జాయింట్‌ కలెక్టర్‌ జి.రాజకుమారితో కలిసి నిర్వహించిన స్పందన కార్యక్రమంలో కలెక్టర్‌ మాట్లాడుతూ కొన్ని ప్రభుత్వ సేవలను మానవత్వంతో అందించాలని సూచించారు. ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూనే వృద్ధులకు, దివ్యాంగులకు అండగా నిలవాలన్నారు. ఇటీవల కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగాలు పొందిన సిబ్బంది సీనియర్ల వద్ద పని నేర్చుకోవాలన్నారు. ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని చెప్పారు. కార్యాలయ పనివేళలు ఖచ్చితంగా పాటించాలన్నారు. అనంతరం వచ్చిన 237 అర్జీలను కలెక్టర్‌, జేసీ, డీఆర్వో చంద్రశేఖరరావు, జిల్లా అధికారులు పరిశీలించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement