కానిస్టేబుల్‌ కుమార్తెకు కాన్పూర్‌ ఐఐటీ సీటు | - | Sakshi
Sakshi News home page

కానిస్టేబుల్‌ కుమార్తెకు కాన్పూర్‌ ఐఐటీ సీటు

Jul 28 2023 1:48 AM | Updated on Jul 28 2023 12:33 PM

అనుపమను అభినందిస్తున్న ఎస్పీ మల్లికా గర్గ్‌   - Sakshi

అనుపమను అభినందిస్తున్న ఎస్పీ మల్లికా గర్గ్‌

గుంటూరు: మార్టూరు పోలీస్‌ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న పూర్ణాంజనేయరాజు చిన్న కుమార్తె అనుపమ ప్రతిష్టాత్మక కాన్పూర్‌ ఐఐటీలో ఇంజినీరింగ్‌ సీటు సాధించింది. ఈ సందర్భంగా కానిస్టేబుల్‌ కుటుంబాన్ని ప్రకాశం జిల్లా ఎస్పీ మల్లికా గర్గ్‌ గురువారం తమ కార్యాలయానికి పిలిపించుకొని అనుపమను శాలువాతో సత్కరించి రూ.10 వేలు నగదు పురస్కారం బహుమతిగా అందించారు.

ప్రస్తుతం కాన్పూర్‌ ఐఐటీ కళాశాలలో మూడో ఏడాది ఇంజినీరింగ్‌ చదువుతున్న కానిస్టేబుల్‌ పూర్ణాంజనేయరాజు పెద్ద కుమార్తె జాహ్నవి గతంలో ర్యాంకు సాధించిన సందర్భంగా ఎస్పీ మల్లికా గర్గ్‌ రూ.25 వేలు నగదు పురస్కారం అందించి అభినందించినట్లు కానిస్టేబుల్‌ గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో కానిస్టేబుల్‌ భార్య సునీత కుమార్తెలు జాహ్నవి, అనుపమ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement