అందాల ఆతిథ్యం.. అంతర్జాతీయ గౌరవం.. | Miss World Contest In Hyderabad | Sakshi
Sakshi News home page

Miss World 2025: అందాల ఆతిథ్యం.. అంతర్జాతీయ గౌరవం..

May 3 2025 8:03 AM | Updated on May 3 2025 2:16 PM

Miss World Contest In Hyderabad

అంతర్జాతీయ యవనికపై తెలంగాణ బ్రాండ్‌ ఇమేజ్‌ పెంచేలా.. 

 హైదరాబాద్‌లో మే 7 నుంచి 31 వరకూ వేడుకగా పోటీలు 

తెలంగాణ సంస్కృతి, చరిత్ర, పర్యాటక, ఆధ్యాత్మిక, మెడికల్, సేఫ్టీ టూరిజాన్ని తెలియజేసేలా ప్రణాళికలు 

తెలంగాణ గ్రోత్‌ స్టోరీ ప్రపంచానికి పరిచయం చేయడానికి ప్రత్యేక థీమ్స్, టూరిస్ట్‌ సర్క్యూట్స్‌

ప్రస్తుతం ప్రపంచం మొత్తం హైదరాబాద్‌ వైపే చూస్తోంది. మరి కొద్ది రోజుల్లో నగర వేదికగా ప్రారంభం కానున్న ప్రతిష్టాత్మక మిస్‌ వరల్డ్‌ పోటీల నేపథ్యంలో హైదరాబాద్‌ విశిష్టత విశ్వవ్యాప్తం కానుంది. ఈ నేపథ్యంలో దేశానికే తలమానికమైన భాగ్యనగరాన్ని సర్వాంగసుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ఈ నెల 10 నుంచి 31వ తేదీ వరకూ జరగనున్న 72వ మిస్‌ వరల్డ్‌–2025 పోటీల్లో భాగంగా తెలంగాణ ప్రత్యేకతలను ప్రపంచానికి తెలిపేలా, అంతర్జాతీయంగా తెలంగాణకు బ్రాండ్‌ ఇమేజ్‌ పెంచేలా కార్యాచరణ సిద్ధం చేసింది తెలంగాణ‌ (Telangana) రాష్ట్ర ప్రభుత్వం. అయితే 7వ తేదీ నుంచే సన్నాహక కార్యక్రమాలు ప్రారంభం కానుండగా 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకూ మిస్‌ వరల్డ్‌ పోటీల కంటెస్టెంట్లు హైదరాబాద్‌ చేరుకోనున్నారు. ఇందులో భాగంగా మిస్‌ వరల్డ్‌ చైర్‌పర్సన్, సీఈఓ జూలియా ఎవెలిన్‌ మోర్లీ శుక్రవారం నగరంలోని రాజీవ్‌ గాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ పోర్ట్‌కు చేరుకోగా.. వారికి ఘన స్వాగతం పలికారు.జూలియాతో పాటు విచ్చేసిన మిస్‌ వరల్డ్‌ అధికారిణి కెర్రీ ఇతర అధికారులకు భారతీయ సంప్రదాయం పద్దతిలో ఘన స్వాగతం పలికారు. 

సుమారు 120 దేశాల నుంచి కంటెస్టెంట్‌లు పాల్గొననున్న ఈ మెగా ఈవెంట్‌ను సువర్ణ అవకాశంగా మలుచుకొని రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నారు. ‘ప్రపంచం కళ్లన్నీ తెలంగాణవైపే!’ అనే స్లోగన్‌తో ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం చరిత్రలో మైలురాయిగా నిలువనుంది. ఈ సందర్భంగా తెలంగాణ సంస్కృతి, చరిత్ర, పర్యాటక ఆకర్షణలు, మెడికల్, సేఫ్టీ టూరిజం, తెలంగాణ గ్రోత్‌ స్టోరీ, ఇతర ప్రత్యేకతలు ప్రపంచానికి పరిచయం చేయడానికి ప్రత్యేక థీమ్స్, టూరిస్ట్‌ సర్క్యూట్లు రూపొందించారు. ఇందులో భాగంగా మిస్‌ వరల్డ్‌–2025 (Miss World 2025) కార్యక్రమం ప్రయాణ ప్రణాళికలు, వేదికలను తెలంగాణతో పాటు హైదరాబాద్‌ నగరంలో ప్రత్యేకంగా రూపొందించారు.

నగర వేదికగా మిస్‌ వరల్డ్‌ థీమ్స్, టూరిస్ట్‌ సర్క్యూట్స్‌.. 
హైదరాబాద్‌ హెరిటేజ్‌ వాక్‌.. (మే 12న..) హైదరాబాద్‌ సాంస్కృతిక వారసత్వం, గొప్పదనం ప్రపంచానికి తెలియజేసేలా నగరంలోని చారిత్రాత్మక ఆనవాలైన చారి్మనార్, లాడ్‌ బజార్‌లలో ప్రత్యేకంగా ‘హెరిటేజ్‌ వాక్‌’ నిర్వహిస్తారు.  

చౌమహల్లా ప్యాలెస్‌ సందర్శన.. (మే 13న..) 
హైదరాబాద్‌ (Hyderabad) నగరానికే తలమానికమైన చౌమహల్లా ప్యాలెస్‌ సందర్శిస్తారు. అక్కడ లైవ్‌ మ్యూజిక్‌ కాన్సర్ట్‌ను తిలకిస్తారు. 

ఎక్స్పీరియా ఎకో పార్క్‌ సందర్శన.. (మే 16న..) 
గ్రూప్‌–2 మిస్‌ వరల్డ్‌ కంటెస్టెంట్‌లు మే 16 సాయంత్రం.. హైదరాబాదు నగరానికే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్న ఎక్సీ్పరియన్‌ ఎకో పార్కును సందర్శిస్తారు. 

మెడికల్‌ టూరిజం పై పరిచయం.. (మే 16న..) 
వివిధ దేశాల నుంచి రోగులను ఆకర్షించే ఉద్దేశంతో మెడికల్‌ టూరిజాన్ని సైతం పరిచయం చేయనున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్‌లోని ఏఐజీ హాస్పిటల్‌లో నిర్వహించే మెడికల్‌ టూరిజం ఈవెంట్‌కు గ్రూప్‌–1 మిస్‌ వరల్డ్‌ కంటెస్టెంట్‌లు హాజరవుతారు. హైదరాబాద్‌లోని ఆధునిక ఆస్పత్రుల ప్రత్యేకతలను వారికి వివరిస్తారు.  

ఘనంగా గ్రాండ్‌ ఫినాలే.. 
మే 22న నిర్వహించే మిస్‌ వరల్డ్‌ టాలెంట్‌ ఫినాలేలో.. 23న హెచ్‌ 2 హెచ్‌ ఛాలెంజ్‌ ఫినాలేలో కంటెస్టెంట్లు పాల్గొంటారు. 24న మిస్‌ వరల్డ్‌ టాప్‌ మోడల్, ఫ్యాషన్‌ ఫినాలే – జ్యువెలరీ/పెర్ల్‌ గది షో మిస్‌ వరల్డ్‌ టాప్‌ మోడల్, ఫ్యాషన్‌ ఫినాలే కార్యక్రమాల్లోనూ పాల్గొంటారు. 26న బ్యూటీ విత్‌ ఫ్యాషన్‌ కాంటెస్ట్‌ నిర్వహిస్తారు. చివరగా 31వ తేదీన మిస్‌ వరల్డ్‌ గ్రాండ్‌ ఫినాలే నిర్వహిస్తారు. ఇవే కాకుండా హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని నాగార్జునసాగర్, బౌద్ధవనం ప్రాజెక్టు, వరంగల్‌ వెయ్యి స్థంభాల గుడి, వరంగల్‌ పోర్ట్, యునెస్కో గర్తింపు పొందిన రామప్ప ఆలయం, ప్రతిష్టాత్మక యాదగిరి గుట్ట దేవాలయం తదితర ప్రదేశాలను సందర్శిస్తారు. 

మిస్‌ వరల్డ్‌ ఆటల తుది పోటీలు.. (మే 17న..) 
మిస్‌ వరల్డ్‌ కంటెస్టెంట్‌లు గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియంలో నిర్వహించే మిస్‌ వరల్డ్‌ స్పోర్ట్స్‌ ఫైనల్‌ పోటీల్లో పాల్గొంటారు. 

రామోజీ ఫిలిం సిటీ సందర్శన.. (మే 17న..) 
ప్రపంచంలోనే అతిపెద్ద ఫిల్మ్‌ సిటీలో ఒకటిగా గుర్తింపు పొందిన ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్‌ సిటీని మిస్‌ వరల్డ్‌ కంటెస్టెంట్లు సందర్శిస్తారు. 

సేఫ్టీ టూరిజం.. (మే 18న..) 
మిస్‌ వరల్డ్‌ కంటెస్టెంట్‌లు తెలంగాణ పోలీస్‌ ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను సందర్శించి తెలంగాణ ప్రభుత్వం పౌరుల భద్రతకు తీసుకుంటున్న చర్యలను, ప్రభుత్వం సేఫ్టీ టూరిజం ఇనీషియేటివ్‌ను పరిశీలిస్తారు.  

సచివాలయ సందర్శన.. (మే 18న..) 
మిస్‌ వరల్డ్‌ కంటెస్టెంట్‌లకు అధికారులు తెలంగాణ రాష్ట్ర గ్రోత్‌ స్టోరీ, చరిత్రను తెలియజేస్తారు. ట్యాంక్‌ బండ్‌ పైన ప్రతి ఆదివారం ఏర్పాటు చేసే సండే ఫండే కారి్నవాల్‌ను కూడా సందర్శిస్తారు.  

ఐపీఎల్‌ మ్యాచ్‌కు హాజరు.. (మే 20 లేదా 21..) 
ఉప్పల్‌లోని రాజీవ్‌ గాంధీ ఇంటర్నేషనల్‌ స్టేడియంలో జరగనున్న ఐపీఎల్‌ మ్యాచ్‌కు గ్రూప్‌–1 కంటెస్టెంట్లు హాజరవుతారు.  

తెలంగాణ కళాకారులచే ఆర్ట్స్, క్రాఫ్ట్స్‌ వర్క్‌ షాప్‌.. (మే 21న..) 
గ్రూప్‌–2 కంటెస్టెంట్లు శిల్పారామంలో తెలంగాణ కళాకారులచే నిర్వహించే ఆర్ట్స్, క్రాఫ్ట్స్‌ వర్క్‌ షాప్స్‌కు హాజరవుతారు. స్వయంగా వాటి తయారీలో భాగమై ప్రత్యక్షంగా తయారీ గురించి తెలుసుకుంటారు.   

Advertisement
 
Advertisement
Advertisement