ఆ.. డిస్కషన్స్ రావు | Latest News and Updates about Kajal Aggarwal | Sakshi
Sakshi News home page

ఆ.. డిస్కషన్స్ రావు

Jun 8 2025 12:25 AM | Updated on Jun 8 2025 12:25 AM

Latest News and Updates about Kajal Aggarwal

స్టార్‌ హీరోయిన్‌గా మామూలు వెలుగు వెలగలేదు కాజల్‌ అగర్వాల్‌. పెళ్ళయిన తర్వాత కెరీర్‌ ముగింపుకి వచ్చినట్లే అని అనుకున్న వాళ్ల నోరు మూయించేలా మళ్లీ తెరపైకి రాబోతోంది.

⇒  ఈ ఏడాది కాజల్‌ అగర్వాల్‌కి ఓ రకంగా స్పెషల్‌ ఇయర్‌. జూన్‌ 19న 40వ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతోంది.
2020లో పెళ్ళయిన తర్వాత ‘భగవంత్‌ కేసరి’లో బాలకృష్ణతో కలిసి నటించింది. ‘ఆచార్య’లో చిరంజీవితో కలిసి నటించే చాన్స్ వచ్చినా, మొదట్లోనే ఆ క్యారెక్టర్‌ని స్క్రిప్టులో నుంచి తీసేశారు. చిత్రీకరించిన సీన్స్, సాంగ్‌ కూడా డిలీట్‌ చేసేశారు.

హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ జోనర్‌ సినిమా ట్రై చేసి, ‘సత్యభామ’తో మంచి రిజల్ట్స్‌ అందుకోలేకపోయింది.
⇒  సల్మాన్‌ ఖాన్‌ ‘సికిందర్‌’ సినిమా డిజాస్టర్‌ అనే మాట అటుంచి, అసలు ఏ మాత్రం ప్రాధాన్యం లేని క్యారెక్టర్‌ చేసి, అందరిని షాక్‌కి గురి చేసింది కాజల్‌ అగర్వాల్‌.

⇒  ఇటువంటి దశలో – కాజల్‌కి అద్భుతమైన అవకాశం వచ్చింది. విష్ణు మంచు నటిస్తున్న  ‘కన్నప్ప’ సినిమాలో పార్వతీదేవిగా నటిస్తోంది. కాజల్‌కి ఇది మొదటి పౌరాణిక పాత్ర.

⇒  కాజల్‌ అగర్వాల్‌ పార్వతీదేవి గెటప్‌ చూసే, మండోదరి పాత్ర ఆఫర్‌ వచ్చింది. సాయి పల్లవి, రణ్‌బీర్‌ కపూర్‌ – సీతారాములుగా నటిస్తున్న ‘రామాయణం’ సినిమాలో యశ్‌ రావణాసురుడిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. అతని సరసన మండోదరిగా కాజల్‌ అగర్వాల్‌ నటించబోతోందని సమాచారం.
⇒  విష్ణు మంచుకి ట్విన్‌ సిస్టర్‌గా ‘మోసగాళ్ళు’ సినిమాలో నటించింది కాజల్‌ అగర్వాల్‌. ఆ పరిచయం కారణంగానే పార్వతీదేవి పాత్ర వచ్చింది.

⇒  అక్షయ్‌ కుమార్‌ శివుడు క్యారెక్టర్‌ చేస్తున్నాడనే సంగతి తెలిసిందే! కొన్నేళ్ళ ముందు అక్షయ్‌ కుమార్‌ కాంబినేషన్‌లో ‘స్పెషల్‌ ఛబ్బీస్‌’ సినిమాలో చేసింది కాజల్‌ అగర్వాల్‌ .
⇒  వ్యక్తిగత విషయాలకొస్తే, భర్త గౌతమ్‌ ఇంటీరియర్‌ డెకార్స్‌కి సంబంధించిన ఇ కామర్స్‌ బిజినెస్‌ చేస్తుంటాడు. భర్త ఆదాయం కన్నా– కాజల్‌ అగర్వాల్‌ ఆస్తి పాస్తులు ఎక్కువ. తామిద్దరి మ«ధ్య ఫైనాన్షియల్‌ మేటర్స్‌ గురించి డిస్కషన్స్ రావని చెప్పింది కాజల్‌.

⇒  నటిగా ఎంత బిజీగా ఉన్నా, బాబు ఆలనా పాలనకి ఇంపార్టెన్స్‌ ఇస్తానని చెప్పింది. ‘సత్య భామ’ షూటింగ్‌కి కొడుకుని ముంబై నుంచి తనతో పాటు తీసుకొచ్చింది. ప్రైవేట్‌ హౌస్‌లో ఉండి, బాబుతో టైమ్‌ స్పెండ్‌ చేసింది.
⇒  పెళ్ళయిన తర్వాత హీరోయిన్లకి కెరీర్‌ ముగిసి పోయిందనేది ఇప్పుడు కరెక్ట్‌ కాదని, కొత్తదారులకు తలుపులు తెరుచుకుంటాయని అంటుంది కాజల్‌ అగర్వాల్‌. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement