డ్రై ఫ్రూట్స్‌ ఎన్ని... ఎలా... తింటున్నారు? | How to eat dry fruits | Sakshi
Sakshi News home page

డ్రై ఫ్రూట్స్‌ ఎన్ని... ఎలా... తింటున్నారు?

Jun 1 2024 8:40 AM | Updated on Jun 1 2024 11:41 AM

How to eat dry fruits

డ్రై ఫ్రూట్స్‌! ఇవి ఆరోగ్యానికి మంచిదని చాలా మంది సూచిస్తారు.ప్రోటీన్స్, ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్, మినరల్స్‌ ఇవన్నీ ఆరోగ్యం మెరుగ్గా ఉండటానికి కావాల్సినవి. వీటన్నింటిని ΄పోందడానికి డ్రై ఫ్రూట్స్‌ ఒక ఆప్షన్‌. అయితే ఇవి ఆరోగ్యానికి మంచిది కదా అని.. ఇష్టమొచ్చినట్టు తినకూడదు. దేనికైనా ఒక పరిమితి ఉంటుంది. అయితే ఎంత పరిమాణంలో తినాలి. ఏ డ్రై ఫ్రూట్స్‌ ఎన్ని తింటే ఆరోగ్యకరం? డ్రైఫ్రూట్స్‌ను తినడానికి ముందు ఎందుకు నానబెట్టాలి? లాభాలేంటి..?

డ్రై ఫ్రూట్స్‌లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే.. షుగర్స్, క్యాలరీ లు కూడా ఉంటాయి. కాబట్టి వీటిని 20 గ్రాముల కంటే ఎక్కువ తినకూడదు. అలాగే నేరుగా తినడం కూడా మంచిది కాదు. కాబట్టి.. డ్రై ఫ్రూట్స్‌ తినే విధానం, ఏ నట్స్‌ ఎంత పరిమాణంలో తినాలో తెలుసుకుందాం.

బాదం... బాదం పప్పులో మోనో శ్యాచురేటెడ్‌ యాసిడ్స్‌ ఎక్కువ గా ఉంటాయి. ఇవి గుండెకి, మెదడుకి, చర్మ ఆరోగ్యానికి మంచిది. అలాగే ఆల్మండ్స్‌ లో విటమిన్‌ ఈ, మెగ్నీషియం, ΄పోటాషియం ఉంటాయి. ఇవి రక్తప్రరణ సక్రమంగా ఉండటానికి సహాయపడతాయి. అలాగే రక్త ప్రసరణ సజావుగా సాగడానికి సహకరిస్తాయి. రోజుకి 4 నుంచి 7 బాదం పప్పులు తినడం వల్ల అన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు ΄పోందవచ్చు.

వాల్‌ నట్స్‌... వాల్‌ నట్స్‌ పైన ఉండే పెంకు తీయగానే.. ఉండే పప్పు అంత రుచిగా ఉండదు. కానీ.. 90 శాతం యాంటీ ఆక్సిడెంట్స్, ఫెనోలిక్‌ యాసిడ్స్, టాన్నిన్స్, ఫ్లేవనాయిడ్స్‌ ఈ స్కిన్‌ లోనే ఉంటాయట. గుండె సంబంధిత వ్యాధుల నుంచి రక్షించడంలో ఇవి చాలా సమర్థంగా పనిచేస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. వీటిని రోజుకి 3 నుంచి 4 తీసుకోవచ్చు.

కర్జూరం... ఇందులో ఆరోగ్యంగా ఉండటానికి ఉపయోగపడే న్యూట్రియంట్స్, విటమిన్స్, మినరల్స్‌ పుష్కలంగా ఉంటాయి. అలాగే ఫ్రాక్టోజ్‌ ఇందులో రిచ్‌ గా ఉంటుంది. మెటబాలిజం స్థాయి చురుగ్గా ఉండటానికి కర్జూరం ఉపయోగపడుతుంది. వీటిని రోజుకి మీడియం సైజులో ఉండే 1 లేదా రెండు తీసుకుంటే సరి΄ోతతుంది.

పిస్తా... పిస్తా వెల్‌ నెస్‌ కి చిహ్నం. ఇవి బలానికి, ఆరోగ్యానికి బాగా ఉపయోగపడతాయి. ఇందులో మిగిలిన డ్రైఫ్రూట్స్‌ లో కంటే ్రపోటీన్‌ కంటెంట్‌ ఎక్కువగా ఉంటుంది. వీటిని రోజుకి 20 గ్రాముల కంటే ఎక్కువ తీసుకోకూడదు.

జీడిపప్పు... కమ్మటి రుచిలో ఉండే జీడిపప్పును రెగ్యులర్‌ గా తినడం వల్ల పిత్తాశయంలో రాళ్లు ఏర్పడకుండా నివారించవచ్చని అధ్యయనాలు సూచిస్తున్నాయి. రోజుకు నాలుగు జీడిపప్పులను తినడం ఆరోగ్యకరమని ఈ అధ్యయనాలు చెబుతున్నాయి.

ఎండుద్రాక్ష... ఎండుద్రాక్షను ఎక్కువ మోతాదులో తిన్నా ఎలాంటి సమస్యా లేదు. ఇందులో విటమిన్‌ బి, ΄పోటాషియం, ఐరన్‌ పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి రోజుకి గుప్పెడు ఎండుద్రాక్ష తినవచ్చు. అయితే మహిళలు రోజుకి ఒకటిన్నర కప్పు, మగవాళ్లు 2 కప్పుల ఎండుద్రాక్ష తినాలని నిపుణులు సూచిస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement