
ఇన్నాళ్లు వంటలు చేయగా మిగిలిన నూనెని తిరిగి వాడొద్దని హెచ్చరించేవారు. ఇప్పుడు ఏకంగా అసలు వంటనూనెలే వాడొద్దని వార్నింగ్ ఇచ్చేస్తున్నారు. పైగా అవి కేన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయంటూ.. విస్తుపోయే విషయాలు చెబుతున్నారు. ఇదేంటి ఇంకేం వాడాలి వంటకు అన్న అనుమానం రావడం సహజమే. కానీ తాజా పరిశోధనలు వంట నూనెలు కేన్సర్ ప్రమాదాన్ని ప్రోత్సహిత్సాయని చెబుతున్నాయి. అంతేగాదు అదెలా జరుగుతుందో కూడా సవివరంగా వివరించారు పరిశోధకులు.
వీల్ కార్నెల్ మెడిసిన్ పరిశోధకుల బృందం చేసిన పరిశోధనల్లో వంట నూనెలు, కూరగాయల నూనెలు అతిగా వాడకూడదని తేలింది. ఆ నూనెల్లో ఉండే లినోలెయిక్ కేన్సర్ కణాల పెరుగుదలను ప్రోత్సహిస్తుందట. ముఖ్యంగా రొమ్మ కేన్సర్(Breast Cancer)లోని కణాల్లో పెరుగుదల అనూహ్యంగా ఉంటుందని తెలిపాయి. అత్యంత ప్రమాదకరమైన ట్రిపుల్-నెగటివ్ రొమ్ము కేన్సర్ ప్రమాదాన్ని ఈ లినోయిక్ ఆమ్లం వేగవంతం చేస్తుందట.
అంటే సాధారణ రొమ్ము కేన్సర్‌లో కంటే ఈ ట్రిపుల్ నెగటివ్‌లో కేన్సర్ కణాలు వేగంగా అభివృద్ధి చెందుతుంటాయి. ఇక మనం వాడే ఈ నూనెలు ఆ కేన్సర్ కణాలను మరింత అభివృద్ధి చేస్తాయని గుర్తించామని అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా సోయాబీన్, కుసుమ నూనె వంటి సీడ్స్ ఆయిల్స్, పందిమాంసం, గుడ్లు వంటి జంతువుల్లో కనిపించే ఒమేగా 6 కొవ్వు ఆమ్లం లినోలెయిక్ చికిత్స చేయడానికే కష్టతరమైన ట్రిపుల్ నెగిటివ్ రొమ్ము కేన్సర్ పెరుగదలను ప్రత్యేకంగా పెంచగలదని పరిశోధనలో నిరూపితమైందన్నారు.
లినోలెయిక్ ఆమ్లం FABP5 అనే ప్రోటీన్‌తో బంధించడం ద్వారా కేన్సర్ కణితి కణాలను మరింత వేగంగా అభివృద్ధి చెందేలా సక్రియం చేస్తుందని పరిశోధకులు గుర్తించారు. కానీ ఇతర హార్మోన్ సెన్సిటివ్ ఉప రకాల్లో అలా జరగడం లేదు.
అంటే ఇక్కడ లినోలెయిక్ ఆమ్లం అధికంగా ఉన్న ఆహారం కేన్సర్ కణితి పెరుగుదల మెరుగ్గా ఉంచుతుందని క్లియర్‌గా నిరూపితమైందన్నారు. ఈ పరిశోధన ఆహార కొవ్వులు, కేన్సర్ మధ్య సంబంధాన్ని వివరించడంలో సహాయపడటటేమ గాక నిర్దిష్ట పోషక సిఫార్సులు ఏ రోగులకు ఎక్కువ ప్రయోజనం అనేది క్లియర్ నిర్వచించగలమని అంటున్నారు పరిశోధకులు.
(చదవండి: నలుగురిలో కలవనివ్వకుండా చేసే వ్యాధి.. ! గంటల్లోనే నయం అయిపోతుందట..)