ఎండల్లో... కొబ్బరి నీళ్లతో గేమ్స్‌ వద్దు! | Why Should Avoid Drinking Too Much Of Coconut Water, Know Its Disadvantages In Telugu | Sakshi
Sakshi News home page

ఎండల్లో... కొబ్బరి నీళ్లతో గేమ్స్‌ వద్దు!

Apr 11 2025 9:31 AM | Updated on Apr 11 2025 1:14 PM

Coconut Water: Why Should Avoid Drinking Too Much

ఎండ వేడిని తట్టుకోవడానికి, ఎండా కాలంలో సత్తువతో ఉండడానికి కొబ్బరి నీళ్లు ఎంత ఎక్కువగా తాగితే అంతమంచిది అనుకుంటారు చాలామంది. అయితే ఇది సరిౖయెనది కాదు అంటున్నారు పోషకాహార నిపుణులు. ఎందుకంటే...

కొబ్బరి నీళ్లలో ΄పొటాషియం ఎక్కువగా ఉంటుంది. కొబ్బరి నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల రక్తంలో పొటాషియం స్థాయులు పెరుగుతాయి. శరీరంలో లవణాల సమతూకం దెబ్బతింటుంది. కిడ్నీల పనితీరుపై ప్రభావం చూపుతుంది.

కొబ్బరినీళ్లలో అధిక పొటాషియం వల్ల జీర్ణవ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. కొబ్బరి నీళ్లలో అధిక చక్కెర కంటెంట్‌ వల్ల బరువు పెరగడానికి దారి తీయవచ్చు. డయాబెటిస్, గుండె జబ్బులు, దంత క్షయ ప్రమాదం పెరగవచ్చు.

కొబ్బరితో అలర్జీలు అసాధారణమేమీ కాదు. కొంతమందికి కొబ్బరి నీటి వల్ల అలెర్జీలు రావచ్చు. దద్దుర్లు, వాపుతోబాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురు కావచ్చు.

హైబీపి ఉన్న వారు, మధుమేహ వ్యాధిగ్రస్తులు, పేగు పూత వ్యాధి ఉన్న వాళ్లు కొబ్బరినీళ్లకు దూరంగా ఉండటమే మంచిది. 

(చదవండి: వేగాన్‌ వర్సెస్‌ నాన్‌వెజ్‌ డైట్‌: ఈ కవల సోదరుల ప్రయోగంలో వేటిలో విటమిన్లు ఎక్కువంటే..?)

Advertisement
 
Advertisement
Advertisement