Buy Fitness Hula Hoop For Weight Loss - Sakshi
Sakshi News home page

Fitness Hula Hoop: ఈ స్మార్ట్‌ డివైస్‌తో ఎవరైనా నాజుగ్గా తయారవ్వాల్సిందే

Jul 11 2023 4:29 PM | Updated on Jul 11 2023 4:53 PM

Buy Fitness Hula Hoop For Weight Loss - Sakshi

ఎన్ని చిట్కాలు పాటించినా.. ఎంత డైట్‌ ఫాలో అయినా.. శారీరక శ్రమ ఉంటేనే ఒంట్లో పేరుకున్న కొవ్వు కరుగుతుంది. అందుకే చాలా మంది ప్రతిరోజు వ్యాయామాలు చేసి ఫిట్‌నెస్‌ని కాపాడుకుంటూ ఉంటారు. అయితే రన్నింగ్, స్విమ్మింగ్, సైక్లింగ్‌ వంటి డైలీ వర్కౌట్స్‌ అన్నిటికీ చక్కటి ప్రత్యామ్నాయమే ఈ వెయిటెడ్‌  హూలా హూప్‌. దీన్ని నడుముకు బిగించుకుని.. ఒకే చోట స్థిరంగా నిలబడి కేవలం నడుముని మాత్రమే తిప్పితే.. నాజూగ్గా మారొచ్చు. 

ఈ స్మార్ట్‌ ఎక్స్‌ర్‌సైజ్‌తో నడుము, పొట్ట భాగాల్లోని కొవ్వు ఇట్టే కరుగుతుంది. రోజుకి 30 నిమిషాలు చేస్తే చాలు.. 180 నిమిషాల యోగా / 60 నిమిషాల సైక్లింగ్‌ / 60 నిమిషాల రన్నింగ్‌ చేసినంత ఫలితం దక్కుతుంది. ఇది అన్ని వయసుల వారికి ఉత్తమమైన వ్యాయామం.న్యూ అప్‌గ్రేడెడ్‌ డిజైన్‌తో రూపొందిన ఈ ‘హూలా హూప్‌ డివైస్‌.. మ్యాగ్నెటిక్‌ లాక్‌ సిస్టమ్‌తో సర్దుబాటు చేసుకోవడానికి సులభంగా ఉంటుంది.

13 నాట్స్‌తో ఉన్న ఈ టూల్‌ని 28 నాట్స్‌ దాకా అటాచ్‌ చేసుకుని.. లావుగా ఉన్న వాళ్లు కూడా వాడుకోవచ్చు. ప్రతి నాట్‌కి 24 మసాజ్‌ పాయింట్స్‌ ఉంటాయి. దీనికి వేల్లాడే ఒక వెయిట్‌ బాల్‌.. 360 డిగ్రీలు గిర్రున తిరుగుతూ ప్రతి మసాజ్‌ హెడ్‌ని ప్రెస్‌ చేస్తూ వెళ్తుంది. దాంతో చుట్టూ పేరుకున్న కొవ్వు వేగంగా కరిగిపోతుంది. 
 

Advertisement
 
Advertisement
Advertisement