దైవిక పద్ధతి.. | Bible Study Through Church Teaching Life Lessons | Sakshi
Sakshi News home page

దైవిక పద్ధతి..

Oct 24 2026 8:49 AM | Updated on Oct 24 2026 8:49 AM

Bible Study Through Church Teaching Life Lessons

బైబిలును అర్థవంతంగా ఉన్నది ఉన్నట్లుగా నేర్చుకొనే ఏకైక చోటు సంఘము. ఒక్కటే శరీరమను క్రీస్తు సంఘము. శోధింప శక్యముకాని క్రీస్తు ఐశ్వర్యమును అనగా యావత్తు బైబిలును క్రీస్తు శరీరం అను సంఘము ద్వారానే నేర్చుకో గలుగుతాము. ఎవరైనా వ్యక్తిగతంగా దివారాత్రములు అధ్యయనం చేస్తూ పరిశో ధిస్తే మాత్రం బైబిలును కొంతవరకే నేర్చుకోగలుగుతారు.

సంఘము ఒక్కటే సంపూర్ణంగా నేర్పగలదు. ఏ పాఠ శాల, ఏ కళాశాల, ఏ విశ్వవిద్యాలయం బైబిలును సంపూర్ణంగా నేర్పలేదు. అవి బైబిలు సంబంధ కాలేజీలు, యూనివర్సిటీలు అయినప్పటికి కూడానూ. సంఘము ద్వారా అనగా క్రీస్తునందున్న పరిశుద్ధుల ద్వారా బైబిలును నేర్చుకొనుటే లేఖనానుసారము. దేవుని పరిశుద్ధుడైన క్రీస్తు, క్రీస్తు పరిశుద్ధులైన అపొస్తలులు, అపొస్తలుల బోధతో యెడతెగక ఉండే ఆదిమ సంఘము, ఆదిమ సంఘం అడుగు జాడలలో నడిచే నేటి క్రీస్తు ప్రభువు సంఘాలు వాక్యం నేర్పడానికి తగిన అర్హత యోగ్యతలను కలిగి ఉన్నాయి.

క్రీస్తునూ; క్రీస్తు ప్రేమ, విధేయతలనూ, ఆయన త్యాగాన్నీ, సహనాన్నీ తమ జీవితాల ద్వారా చూపిస్తూ వాక్యం నేర్పేవారు వ్యక్తి స్థాపిత సంఘాలలో కాకుండా లేఖనానుసార సంఘాలలోనే మనకు ఎక్కువగా తారస పడుతుంటారు. దేవుడు ఏర్పాటు చేసిన ఉపదేశ క్రమాన్ని అనుసరిస్తూ ఇలా ఈ క్రమంలో వాక్యం నేర్చుకొంటేనే అది చెక్కు చెదరక హృదయాంతరంగాన భద్రంగా ఉంటుంది. లేఖనానుసార సంఘము నిర్వహించే బైబిలు అధ్యయన పరిశోధన తరగతుల ద్వారా బైబిలును నేర్చుకొంటేనే అది ఆత్మకు వంటబడుతుంది. 

‘సంఘము ద్వారా తన యొక్క నానావిధ జ్ఞానము ఇప్పుడు తెలియబడవలెనని ఉద్దేశించి’ అను దేవుని వాక్య వచన భాగమే ఈ సత్యాన్ని తేటగా నిర్ధారణ చేస్తూ ఎంతగానో బలపరుస్తుంది. బైబిలు నేర్చుకొనుటకు ఎన్నో పద్ధతులు, మార్గాలు ఉన్ననూ సంఘము ద్వారా నేర్చుకొనే దైవిక పద్ధతే చాలా శ్రేష్ఠమైనదని చెప్పకతప్పదు.
– జేతమ్‌

ఇదీ చదవండి: అయోధ్య రామ మందిరాన్ని తలపించేలాగా!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement