చేపలు విక్రయించే ఇంట ఇంగ్లిష్‌ చదువు | Sakshi
Sakshi News home page

చేపలు విక్రయించే ఇంట ఇంగ్లిష్‌ చదువు

Published Fri, May 3 2024 11:00 AM

చేపలు విక్రయించే ఇంట ఇంగ్లిష్‌ చదువు

మాది పిఠాపురం మండలం పి.దొంతమూరు. మా గ్రామంలోని జెడ్పీ హైస్కూల్లో 9వ తరగతి చదువుతున్నాను. నాన్న చేపల వ్యాపారి. మా గ్రామంలోని సంపన్నుల పిల్లలు ప్రైవేట్‌ స్కూళ్లలో చదువుతూ ఇంగ్లిషులో మాట్లాడుతుంటే నేను అలా మాట్లాడగలిగితే బాగుండును అనిపించేది. అనుకోకుండా సీఎం వైఎస్‌ జగన్‌ మావయ్య ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిషు విద్య ప్రవేశ పెట్టి అమలు చేస్తుండడంతో నాకూ ఈ అవకాశం వచ్చింది. తక్కువ సమయంలో ఇంగ్లిషు బాగా నేర్చుకున్నాను. నా ఇంగ్లిషు మాట తీరు చూసి మా నాన్న ఇందతా సీఎం వైఎస్‌ జగన్‌ చలువే అంటూ మురిసిపోతున్నారు.

–సిమ్మా వీర దుర్గ, 9వ తరగతి విద్యార్థిని, పి దొంతమూరు, పిఠాపురం మండలం

Advertisement
 
Advertisement