వైస్ ఎంపీపీ ఇంటిపై దాడికి యత్నం
గోపాలపురం: వైఎస్సార్ సీపీకి చెందిన వైస్ ఎంపీపీ వంగా నారాయణమ్మ ఇంటిపై మంగళవారం రాత్రి టీడీపీ నాయకులు దాడికి యత్నించారు. రాత్రి సుమారు 11 గంట సమయంలో జగన్నాథపురంలోని నారాయణమ్మ ఇంటి వద్దకు టీడీపీకి చెందిన సుమారు 20 మంది కార్యకర్తలు మద్యం తాగి వచ్చారు. ఆమెను దుర్భాషలాడుతూ కులం పేరుతో తిడుతూ బీభత్సం సృష్టించారు. వెంటనే నారాయణమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వచ్చి టీడీపీ అల్లరి మూకలను చెదరగొట్టారు. ఈ నేపథ్యంలో బుధవారం ఐజీ, ఏలూరు ఇన్‌చార్జి డీఐజీ జీవీజీ అశోక్‌కుమార్, జిల్లా ఎస్పీ జి.జగదీష్ జగన్నాథపురంలో ఏర్పాటు చేసిన పోలీస్ పికెటింగ్‌ను పరిశీలించారు. అనంతరం డీఐజీ అశోక్ కుమార్ మాట్లాడుతూ రెచ్చకొట్టే వ్యాఖ్యలు చేసినా, దాడులకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వైస్ ఎంపీపీ నారాయణమ్మ ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ చేపట్టి దోషులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యే వరకూ సమస్యాత్మక గ్రామాలలో పోలీసు పికెటింగ్ కొనసాగుతుందన్నారు. ఆయన వెంట కొవ్వూరు డీఎస్పీ కేసీహెచ్ రామారావు, దేవరపల్లి సీఐ కె.బాలసురేష్, ఎస్సై కర్రి సతీష్ కుమార్ ఉన్నారు.
మద్యం తాగి టీడీపీ కార్యకర్తల వీరంగం
పోలీసుల రంగప్రవేశంతో సద్దుమణిగిన వివాదం
Comments
Please login to add a commentAdd a comment