Hyderabad: కూకట్‌పల్లిలో విషాదం.. | Young Woman Committed Suicide At Kukatpally | Sakshi
Sakshi News home page

Hyderabad: కూకట్‌పల్లిలో విషాదం.. విజయ లక్ష్మి ఏం చేసిందంటే..?

May 19 2022 6:33 PM | Updated on May 19 2022 6:34 PM

Young Woman Committed Suicide At Kukatpally - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగరంలోని కూకట్‌పల్లిలో విషాద ఘటన చోటుచేసుకుంది. వివాహం కావడంలేదని మనస్థాపంతో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమవుతున్నారు. 

వివరాల ప్రకారం.. కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని వివేక్ నగర్‌లో విజయ లక్ష్మి(26) అనే యువతి కుటుంబ సభ్యులతో కలిసి జీవిస్తోంది. అయితే, తనకు పెళ్లి సంబంధాలు ఎన్ని వచ్చినా.. వివాహం మాత్రం కావడంలేదని జీవితంపై విరక్తితో బుధవారం రాత్రి ఉరివేసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. దీంతో ఆమెను కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. కాగా, ఆసుపత్రిలో చికిత్స పొందతూ విజయ లక్ష్మి గురువారం మృతి చెందింది. 

ఇది కూడా చదవండి: ప్రియుడితో భార్య రాసలీలలు.. భర్త ఏం చేశాడంటే..?

Advertisement
 
Advertisement
Advertisement