Hyderabad Police Raids On Prostitution House In Bowenpally - Sakshi
Sakshi News home page

Hyderabad: అపార్ట్‌మెంట్‌లో వ్యభిచార దందా

Dec 16 2021 9:36 AM | Updated on Dec 16 2021 3:16 PM

Police Raid On Prostitution House In Hyderabad - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, కంటోన్మెంట్‌(హైదరాబాద్‌): రాధాస్వామి కాలనీ రాక్‌ప్రైడ్‌ అపార్ట్‌మెంట్లో వ్యభిచార ముఠా గుట్టు రట్టు చేశారు బోయిన్‌పల్లి పోలీసులు. విశ్వసనీయ సమాచారం మేరకు అపార్ట్‌మెంట్‌లోని ఫ్లాట్‌ నంబర్‌ 201లో దాడి చేసి వ్యభిచార గృహం నిర్వాహకుడు కుత్బాల్లాపూర్‌కు చెందిన ఎండీ అజీజ్, నిజాంపేటకు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి అయిన విటుడు సుబ్రహ్మణ్యంతో పాటు మరో మహిళను అదుపులోకి తీసుకున్నారు.

నిందితుల నుంచి రూ.4 వేల నగదు, మూడు సెల్‌ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నారు. అజీజ్‌తో పాటు ప్రదీప్‌ అనే మరో వ్యక్తి వృభిచార గృహాన్ని నిర్వహిస్తున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది.   

చదవండి: శిక్షణలో ఉన్న యువతిపై ఇంజినీర్ల అసభ్య ప్రవర్తన

Advertisement
 
Advertisement
Advertisement