Hyderabad: నగరంలో వివాహిత అదృశ్యం.. | Married Woman Anusha Missing In Hyderabad | Sakshi
Sakshi News home page

Hyderabad: నగరంలో వివాహిత అదృశ్యం..

Dec 19 2021 9:05 PM | Updated on Dec 19 2021 9:10 PM

Married Woman Anusha Missing In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఓ వివాహిత అదృశ్యమైంది. ఎస్సార్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగిన సంఘటన వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంకు చెందిన సురేష్‌ అదే ప్రాంతానికి చెందిన అనూషను 6 నెలల క్రితం పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకున్నాడు. జీవనోపాధి కోసం కొద్ది రోజుల క్రితం నగరానికి వచ్చి ఎస్‌ఆర్‌నగర్‌లోని పద్మావతి అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు.

ఈ నెల 15న అనూష తల్లి, పిన్ని వీరి వద్దకు వచ్చి మూడు రోజులు ఉన్నారు. కాగా శనివారం ఉదయం సురేష్‌ పనిమీద బయటకు వెళ్లి వచ్చేసరికి భార్య అనూషతో పాటు ఇద్దరు మహిళలు కనిపించలేదు. వారి ఆచూకీ కోసం పలు చోట్ల వెతికినా ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

చదవండి: (బుల్లితెరపై చూద్దామనుకుంటే.. శాశ్వతంగా వెళ్లిపోయింది!) 

Advertisement
 
Advertisement
Advertisement