కాలేజ్‌ స్టూడెంట్స్‌ కిస్సింగ్ కాంపిటీషన్ వీడియో.. పోలీసుల అదుపులో ఒకరు

Karnataka Mangaluru Kissing Video Goes Viral Student Detained - Sakshi

మంగళూరు: యూనిఫామ్‌లో.. కౌగిలింతలు, ముద్దులతో రెచ్చిపోయారు విద్యార్థులు. ఆ వీడియో కాస్త వాట్సాప్‌ ద్వారా విపరీతంగా వైరల్‌ అయ్యింది. తల్లిదండ్రులతో పాటు కాలేజీ యాజమాన్యం దృష్టికి వెళ్లింది. ఇంకేం.. పోలీసులు రంగంలోకి దిగారు. 

మంగళూరులో ఓ ప్రముఖ కాలేజీలో చదువుతున్న ఇద్దరు విద్యార్థుల వీడియో ఒకటి వాట్సాప్‌ గ్రూప్‌ల ద్వారా విపరీతంగా వైరల్‌ అయ్యింది. పరువు పోవడంతో తల్లిదండ్రులు, కాలేజీ యాజమాన్యం ఈ వీడియో మీద ఫిర్యాదు చేయకుండానే పోలీసులను ఆశ్రయించారు. 

ఓ ప్రైవేట్‌ అపార్ట్‌మెంట్‌లో స్టూడెంట్స్‌ మధ్య ముద్దుల పోటీలో Kissing Competition భాగంగా.. ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ వీడియోను చిత్రీకరించిన విద్యార్థినిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. మరిన్ని వివరాల కోసం ప్రశ్నిస్తున్నారు. వీడియోలు తీసే టైంలో డ్రగ్స్‌ తీసుకున్నారా? అనే కోణంలోనూ దర్యాప్తు కొనసాగుతోంది. 

అయితే కిస్సింగ్‌ కాంపిటీషిన్‌ ఘటన జరిగి ఆరు నెలలు అవుతోందని, ఓ ప్రైవేట్‌ ప్లాట్‌లో అది చోటు చేసుకుందని.. అయితే వారం కిందట వాట్సాప్‌ ద్వారా ఓ స్టూడెంట్‌ దానిని వైరల్‌ చేశాడని సిటీ పోలీస్‌ కమిషనర్‌ శశి కుమార్‌ వైరల్‌ వీడియో వివరాలను వెల్లడించారు. కిస్సింగ్‌ కాంపిటీషన్‌లో పాల్గొన్న విద్యార్థులను గుర్తించి.. వాళ్లపై సస్పెన్షన్‌ వేటు వేసినట్లు కాలేజీ యాజమాన్యం ప్రకటించింది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top