Hyd: లిఫ్ట్‌ అడిగి మరీ రేప్‌ బెదిరింపులు! | Hyderabad Lady Cheat Men On Name Of Lift Arrested | Sakshi
Sakshi News home page

జూబ్లీహిల్స్‌లో కి‘లేడీ’: లిఫ్ట్‌ అడిగి, బట్టలు చించుకుని కేకలేస్తూ..

Jan 3 2024 2:47 PM | Updated on Jan 3 2024 2:47 PM

Hyderabad Lady Cheat Men On Name Of Lift Arrested - Sakshi

తానొక లాయర్‌నని.. అన్నీ సెక్షన్లు తెలుసని చెబుతూ రేప్‌ కేసులు పెడతానంటూ బెదిరించి మరీ.. 

హైదరాబాద్‌, సాక్షి: నడిరోడ్డుపై నిల్చుని కారులో వెళ్లేవాళ్లను లిఫ్ట్‌ అడుగుతుంది. జాలిపడి లిఫ్ట్‌ ఇచ్చారో ఇక అంతే!. రేప్‌ చేయబోయారని బెదిరించి మరీ డబ్బులు వసూలు చేస్తుంటుంది. అలా పదుల సంఖ్యలో బెదిరింపు ఉదంతాలకు పాల్పడిన కిలా(లే)డీని ఎట్టకేలకు జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్‌ చేశారు. 

రోడ్డు మీద వెళ్లే వారిని ఆపి ఏదో అర్జంట్‌ పని ఉందంటూ లిఫ్ట్ అడగడం.. వాహనంలో ఎక్కిన తర్వాత ‘రేప్’ చేయబోయారని బెదిరిస్తూ డబ్బులు గుంజడం ఆమెకు బాగా అలవాటు అయ్యింది. పైగా తాను అడ్వకేట్ అని.. తనకు అన్ని సెక్షన్లు తెలుసు అంటూ దబాయింపులకు దిగుతుంది. తాజాగా జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ నుంచి కేబీఆర్‌ పార్క్ దాకా లిఫ్ట్ కావాలి అంటూ ఓ కారు ఎక్కింది. ఆపై దిగేముందు బట్టలు చించుకుని రేప్ కేసు పెడతా అంటూ అల్లరి చేసింది. 

దీంతో సదరు డ్రైవర్‌ పరమానంద.. జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆమె కదలికల మీద నిఘా వేసిన పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిందితురాలిని సయీదా నయీమా సుల్తానాగా గుర్తించిన పోలీసులు.. నగర వ్యాప్తంగా పలు స్టేషన్‌లో ఆమెపై 17 కేసులు ఉన్నట్లు గుర్తించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement