పారిశ్రామికవేత్త ఆత్మహత్య | Sakshi
Sakshi News home page

పారిశ్రామికవేత్త ఆత్మహత్య

Published Wed, Mar 17 2021 2:37 PM

Entrepreneur Eliminates Himself By Hanging Tamil Nadu - Sakshi

టీ.నగర్‌: లంచాలు ఇవ్వాలని అధికారులు వేధించడంతో మనస్తాపానికి గురైన పారిశ్రామికవేత్త ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చెన్నై ఎన్నూరులో సోమవారం ఈ సంఘటన చోటు చేసుకుంది. ఎన్నూరు శివగామినగర్‌కు చెందిన పారిశ్రామికవేత్త విక్రమ్‌ (30). ఇతని భార్య సూర్య. ఏడాదిక్రితం వివాహమైంది. 2019లో రూ.60 లక్షలతో మంచినీటి శుద్ధీకరణ కేంద్రాన్ని విక్రమ్‌ ప్రారంభించాడు. ఇందుకోసం పలువురి వద్ద రుణాలు తీసుకున్నాడు. ఇతన్ని రెవెన్యూ అధికారులు, విద్యుత్‌ బోర్డు, ఆరోగ్యశాఖాధికారులు తరచూ లంచాలు కోరుతూ వచ్చారు.

స్థానిక రాజకీయ నాయకులు మామూళ్ల పేరిట వేధించడంతో  మనస్తాపానికి గురైన ఇతను సోమవారం ఎన్నూరు తాళంగుప్పం ప్రాంతంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గత 12న అధికారులు, రాజకీయనాయకులు లంచాలు కోరుతూ వేధింపులకు గురి చేస్తున్నట్లు అతని సోదరుడు విఘ్నేశ్వరన్‌ పోలీసు అధికారులకు ఈమెయిల్‌లో ఫిర్యాదు చేసినప్పటికీ ఎవరూ పట్టించుకోలేదు. దీంతో విక్రమ్‌ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.  

చదవండి: రూ.26 కోట్ల మోసం.. సంగీత దర్శకుడు అమ్రేష్‌ అరెస్ట్‌

Advertisement

తప్పక చదవండి

Advertisement