సంచలనం కోసమే ఎంపీపై హత్యాయత్నం | Assassination attempt on MP is for sensation | Sakshi
Sakshi News home page

సంచలనం కోసమే ఎంపీపై హత్యాయత్నం

Nov 2 2023 4:09 AM | Updated on Nov 2 2023 4:09 AM

Assassination attempt on MP is for sensation - Sakshi

సిద్దిపేటకమాన్‌: సంచలనం సృష్టించడం కోసమే దుబ్బాక బీఆర్‌ఎస్‌ అభ్యర్థి, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిపై హత్యాయత్నానికి పాల్పడినట్లు నిందితుడు తమ ప్రాథమిక విచారణలో అంగీకరించాడని సిద్దిపేట పోలీసు కమిషనర్‌ శ్వేత బుధవారం తెలిపారు. ఎంపీపై దాడి ఘటనకు సంబంధించి  గ్రామానికి చెందిన నర్సింహులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని సీపీ తెలిపారు.

నిందితుడు వివిధ ఆన్‌లైన్‌ చానళ్లలో పనిచేస్తున్నట్లు తెలిసిందని, విలేకరిని అని చెప్పుకుంటూ బెదిరించి వారి వద్ద నుంచి డబ్బులు వసూలు చేసే వాడన్నారు. ఎంపీపై దాడి చేయాలనే ఉద్దేశంతో వారం రోజుల క్రితం దుబ్బాక మార్కెట్‌ లో నిందితుడు కత్తిని కొనుగోలు చేశాడన్నారు. ఎంపీ ఏయే గ్రామా ల్లో ప్రచారం చేస్తున్నారనే విషయమై సోషల్‌ మీడియా ద్వారా సోమవారం సూరంపల్లి గ్రామానికి వస్తున్న ట్లు తెలుసుకున్నాడని చెప్పారు.

ఈ క్రమంలో దాడికి పాల్పడినట్లు తెలిపారు. నిందితుడు దాడి చేయడానికి ఎవరైనా ప్రోత్సహించారా? ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా?.. అనే కోణాల్లో విచార ణ జరిపి వివరాలు వెల్లడిస్తామన్నా రు. ఆస్పత్రిలో చికిత్స అనంతరం డిశ్చార్జి కావడంతో నిందితుడిని అదుపులోకి తీసు కున్నామని, బుధవారం అరెస్ట్‌ చేసి గజ్వేల్‌ కోర్టులో హాజరుపర్చగా 14 రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించినట్లు తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement