కొత్త బైక్ లాంచ్ చేసిన ట్రయంఫ్ - ధర రూ.9.72 లక్షలు | Triumph Daytona 660 Launched In India | Sakshi
Sakshi News home page

కొత్త బైక్ లాంచ్ చేసిన ట్రయంఫ్ - ధర రూ.9.72 లక్షలు

Aug 29 2024 9:12 PM | Updated on Aug 29 2024 9:13 PM

Triumph Daytona 660 Launched In India

దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన 'ట్రయంఫ్ మోటార్‌సైకిల్' భారతీయ విఫణిలో 'డేటోనా 660' బైక్ లాంచ్ చేసింది. ఈ బైక్ ధర రూ. 9.72 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది దాని డేటోనా 675 ఆధారంగా తయారైంది.

లేటెస్ట్ డిజైన్ కలిగిన ట్రయంఫ్ డేటోనా 660 బైక్.. ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్ సెటప్, కాంపాక్ట్ టెయిల్ సెక్షన్‌ పొందుతుంది. ఇది షోవా 41 మిమీ బిగ్ పిస్టన్ అప్‌సైడ్ డౌన్ ఫోర్క్‌, వెనుకవైపు 130 మిమీ షోవా మోనోషాక్ ప్రీలోడ్ అడ్జస్ట్‌మెంట్ ఉన్నాయి. బ్రేకింగ్ విషయానికి వస్తే.. ఈ బైక్ రేడియల్ కాలిపర్‌లతో 310 మిమీ ట్విన్ డిస్క్‌లు, వెనుక స్లైడింగ్ కాలిపర్‌తో 220 మిమీ సింగిల్ డిస్క్ ఉన్నాయి.

డేటోనా 660 బైక్ 660 సీసీ లిక్విడ్ కూల్డ్ ఇన్‌లైన్ ట్రిపుల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 95 Bhp పవర్, 69 Nm టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్‌బాక్స్‌ కలిగి, స్లిప్ అండ్ అసిస్ట్ క్లచ్‌ పొందుతుంది. ఈ బైక్ ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 14 లీటర్లు. కాబట్టి లాంగ్ రైడింగ్ చేయడానికి కూడా ఇది అనుకూలంగా ఉంటుంది.

డేటోనా 660 బైక్ ఇన్‌స్ట్రుమెంటేషన్ కోసం మల్టీ ఫంక్షన్ కలర్ TFT స్క్రీన్‌ పొందుతుంది. ఈ బైక్ రోడ్, రైన్, స్పోర్ట్ అనే మూడు రైడ్ మోడ్‌లను పొందుతుంది. డ్యూయల్-ఛానల్ ఏబీఎస్, స్విచబుల్ ట్రాక్షన్ కంట్రోల్‌ కూడా ఇందులో ఉంటుంది. ఈ కొత్త బైక్ కవాసకి నింజా 650, ఎప్రిలియా ఆర్ఎస్ 660 వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది.

Advertisement
 
Advertisement
Advertisement