బంగారం, వెండి ధరలు - తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయంటే.. | Sakshi
Sakshi News home page

Today Gold and Silver Price: బంగారం, వెండి ధరలు - తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయంటే..

Published Thu, Feb 22 2024 11:46 AM

Today Gold And Silver Price Today 22 Feb 2024 - Sakshi

భారతదేశంలో పెరుగుతూ, తగ్గుతూ ఉన్న బంగారం ధరలు ఈ రోజు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి, నేడు గోల్డ్ అండ్ సిల్వర్ ధరలు ఏ రాష్ట్రంలో ఎలా ఉన్నాయి? తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా.. చెన్నై, బెంగళూరులో ధరలు పెరిగాయా? లేక తగ్గాయా? అనే వివరాలు ఇక్కడ వివరంగా చూసేద్దాం.

హైదరాబాద్‌, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఈ రోజు ఒక తులం బంగారం ధరలు 57500 (22 క్యారెట్స్), రూ.62730 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు ధరలు వరుసగా రూ.100, రూ.110 తగ్గినట్లు తెలుస్తోంది.

చెన్నైలో నిన్న రూ. 250 నుంచి రూ. 270 వరకు పెరిగిన బంగారం ధరలు ఈ రోజు వరుసగా రూ. 100, రూ. 110 తగ్గింది. దీంతో ఈ రోజు పసిడి ధరలు రూ. 58000 (22 క్యారెట్స్), రూ. 63230 (24 క్యారెట్స్) వద్ద నిలిచాయి.

ఢిల్లీలో ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధరలు రూ. 100 తగ్గి 57650 రూపాయలకు.. 24 క్యారెట్ల ధర రూ. 110 తగ్గి 62880 రూపాయలకు చేరింది. నిన్న రూ. 250 నుంచి రూ. 280 వరకు పెరిగిన బంగారం ధరలు ఈ రోజు కొంత తగ్గాయి.

వెండి ధరలు
బంగారం ధరలు మాత్రమే కాకుండా ఈ రోజు వెండి ధరలు కూడా రూ. 700 (కేజీ) తగ్గింది. హైదరాబాద్, విజయవాడ, ఢిల్లీ, చెన్నై నగరాల్లో కూడా వెండి ధరలు తగ్గాయి.

Advertisement
Advertisement