Navi Technologies Shocking News for Employees Layoffs 200 Employees - Sakshi
Sakshi News home page

Navi Technologies: షాకిచ్చిన స్టార్టప్ కంపెనీ.. బిక్కు బిక్కుమంటున్న ఉద్యోగులు!

Jul 13 2023 3:48 PM | Updated on Jul 13 2023 3:57 PM

Navi technologies shocking news for employees Layoffs 200 employees - Sakshi

ఒక వైపు కొన్ని కంపెనీలు తమ ఉద్యోగులకు గుడ్ న్యూస్‌లు చెబుతుంటే.. ప్రముఖ స్టార్టప్ కంపెనీ 'నవీ టెక్నాలజీ' (Navi Technologies) మాత్రం పెద్ద షాక్ ఇచ్చింది. ఇందులో భాగంగానే 200 మంది ఉద్యోగులను తొలగించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

ఫ్లిప్‌కార్ట్ వ్యవస్థాపకుడు 'సచిన్ బన్సల్' నేతృత్వంలో ఉండే నవీ టెక్నాలజీ కంపెనీ తాజాగా 200 మంది ఉద్యోగులను తొలగించినట్లు ప్రకటించింది. ఇందులో దాదాపు 60 నుంచి 70 శాతం మంది ప్రొడక్ట్ డెవలప్‌మెంట్ అండ్ మేనేజ్‌మెంట్ విభాగానికి చెందిన వారు కావడం గమనార్హం. మిగిలిన ఉద్యోగులు వివిధ విభాగాలకు చెందిన వారు.

(ఇదీ చదవండి: ఏసీ రైలు.. ఇండియన్స్‌ను ఎక్కనించేవారే కాదు.. తొలి ఏసీ కోచ్‌ ఎప్పుడు? ఎక్కడ? ఎలా మొదలైందంటే..)

కంపెనీ రానున్న రోజుల్లో మరింత మంది ఉద్యోగులను తొలగించే అవకాశం ఉందని తెలుస్తోంది. 2021 డిసెంబర్ నాటికి ఈ సంస్థలో ఉన్న ఉద్యోగుల సంఖ్య 4680 మంది. అయితే గత కొన్ని రోజులుగా తొలగింపులు ప్రక్రియ మొదలైంది.. కావున ఈ సంఖ్య త్వరలో మరింత తగ్గుముఖం పట్టే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ ఏడాది పెద్ద పెద్ద కంపెనీలు సైతం తమ ఉద్యోగులను తొలగించినట్లు గతంలో చాలా కథనాల్లో తెలుసుకున్నాం.

Advertisement
 
Advertisement
Advertisement