Microsoft Shuts Operations in Russia, lays Off Over 400 employees - Sakshi
Sakshi News home page

Microsoft: మైక్రోసాఫ్ట్‌ భారీ షాక్‌, వందల మంది ఉద్యోగుల తొలగింపు!

Jun 12 2022 6:51 PM | Updated on Jun 13 2022 1:02 PM

Microsoft Shuts Operations In Russia Over 400 Employees Lays Off - Sakshi

ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యా తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ  ప్రపంచ దేశాలకు చెందిన దిగ్గజ కంపెనీలు రష్యాలో సేవల్ని నిలిపివేశాయి. వికీపీడియా లెక్కల ప్రకారం.. ఇప్పటి వరకు వెయ్యికిపైగా కంపెనీలు రష్యాలో కార్యాకలాపాల్ని నిలిపివేశాయి. వాటిలో టెక్‌ కంపెనీ మైక్రోసాఫ్ట్‌ కూడా ఉంది. ఇప్పుడు ఇందులో పనిచేస్తున్న వందల మంది ఉద్యోగుల్ని మైక్రోసాఫ్ట్‌ తొలగించినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. 

రష్యాలో తమ సేవల్ని నిలిపివేస్తున్నట్లు  చేసిన మైక్రోసాఫ్ట్‌ ప్రకటన ఆ సంస్థలో పనిచేస్తున్న 400మంది ఉద్యోగులు రోడ్డున పడేలా చేసింది. ప్రొడక్ట్‌ అమ్మకాల తగ్గింపు కారణంగా తలెత్తుతున్న నష్టాలు, ఇతరాత్ర కారణాల వల్ల ఆ 400మంది ఉద్యోగుల్ని తొలగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల్ని తొలగించినా వారికి సంస్థ సహాయ,సహకారాలు ఉంటాయని  మైక్రోసాఫ్ట్‌ హామీ ఇచ్చినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. 

రష్యాకు ఐబీఎం గుడ్‌బై 
1980 నుంచి మైక్రోసాఫ్ట్‌ సంస్థ తన ఆపరేటింగ్‌ సిస్టంను ఐబిఎం కంప్యూటర్స్‌తో కలిసి బిల్డ్‌ చేస‍్తుంది. అయితే ఇటీవల ఉక్రెయిన్‌ - రష్యా పరిణామాల నేపథ్యంలో ఐబీఎం రష్యాలో కార్యకలాపాల్ని నిలిపివేసింది. ఐబీఎం తర్వాత మైక్రోసాఫ్ట్‌ రష్యా నుంచి వైదొలొగుతున్నట్లు ప్రకటించింన విషయం తెలిసింది.

Advertisement
 
Advertisement
Advertisement